Telugu Audio books by Kadachepta.com-logo

Telugu Audio books by Kadachepta.com

Kids & Family Podcasts >

More Information

Location:

United States

Twitter:

@kadachepta

Language:

Telugu

Contact:

(517) 580-8065


Episodes

బుద్ధిబలం [ Intelligence ]

7/16/2019
More
ఏదైనా సాధించాలంటే పట్టుదలతో పాటు తెలివి, శ్రద్ద కూడా ఉండాలి. ఈ అన్నదమ్ముల కథ వినండి. పెద్దవాడికి పట్టుదల జాస్తిగా ఉంటుంది, కానీ తెలివి తక్కువ. చిన్నవాడు ఆలా కాకుండా తెలివిగా కూడా మసులుకుని కథ సుఖాంతం చేస్తాడు. వినండి మరి! With background music:

Duration:00:07:57

కాకి తెలివి [ Crow's Smarts ]

7/4/2019
More
కష్టాల్లో ఉన్న ఒక కాకి కథ ఇది. తన కష్టాన్ని ఒక చక్కటి ఉపాయంతో ఎలా తప్పించుకుందో ఈ కథలో నేర్చుకుందాం.

Duration:00:03:54

బాటసారుల అదృష్టం [ Traveler’s Luck ]

6/9/2019
More
ఇద్దరు స్నేహితులు ఒక అడవి మార్గాన వెళ్తుండగా, వారిలో ఒకడికి బంగారు నాణాల సంచి దొరికిందట! అంతే, అక్కడితో మొదలయింది వారి కథ! వినండి మరి..

Duration:00:01:32

అంతా మన మంచికే [ All is well ]

5/26/2019
More
మన పెద్దలు అప్పుడప్పుడూ “అంతా మన మంచికే” అంటుంటారు. దాని పరమార్థం ఏమిటో ఈ కథ వింటే మీకు అర్ధమవుతుంది.

Duration:00:05:50

పులికి ప్రాణం పోస్తే? [ Rescuing a tiger ]

5/25/2019
More
ఒక గురువుగారికి ముగ్గురు శిష్యులు ఉన్నారు. వారికీ అన్ని విద్యలకంటే మాయలు, మంత్రాల మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. వారు ఆ మంత్రాలన్నీ మంచి పనులకు వినియోగించలేకపోతారు. మరి వారి కథ ఏమిటో విందామా మరి? With BGM: Without BGM:

Duration:00:08:00

నక్క మాస్టారు [ Teacher Fox ]

5/19/2019
More
అనగనగా ఒక అడవిలో ఒక తాబేలు ఉండేది. ఆ తాబేలు ఒక నక్క మాస్టారు దగ్గరకు తన పిల్లల్ని చదువులకు పంపించింది. కానీ ఆ నక్క ఒక గుంటనక్క! మరి ఆ తాబేలు మరి వాటి పిల్లలు ఏమయ్యారో వినండి! With background music Without background music

Duration:00:16:32

ఇద్దరు దొంగలు! [ Two Thieves ]

5/15/2019
More
జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంది అని మన పెద్దల సామెత. ఇద్దరు అతి నేర్పరి దొంగలు వారి వారి గ్రామాలలో ఉండేవారు! ఒకనాడు వారిద్దరూ కలిసిన సన్నివేశం ఒకటి జరిగింది. ఈ కథ వినండి, వారి ఘనతో ఏపాటిదో మీకీ అర్ధమవుతుంది! కొత్త కథలు వచ్చినప్పుడు మీకు తెలియాలంటే ఈ కింద మీ ఈ-మెయిల్ ఇవ్వండి..

Duration:00:05:37

ముత్తు కలలు [ Muthu's Dreams]

4/24/2019
More
“కలలు నిజం కావు, అవి సాద్య పడవు. కావున కలలు కనడం తప్పు”. క్షమించండి ఇది నా మాట కాదు. కలలు కనడం ఆపు అని మీకెవరన్న చెప్తే మీరు ఏమంటారు? ఈ కథలోని ముత్తుకి అలంటి సన్నివేశం ఒకటి ఎదురయింది, ఆ సన్నివేశం ఏమిటో మీరు వినండి. విన్నాక కలలు కనడం సరయినదో కాదో చెప్పండి.

Duration:00:05:13

చిన్నారి కప్పు షికారు

4/22/2019
More
అది ఒక చిట్టి చిన్నారి కప్ప! ఒకనాడు నీటిలో ఆడుతుండగా ఒక ఏనుగు పైకి చేరింది, పైనించి చూసే సరికి భయమేసి కిందికి దూకలేదు దాంతో అడివంతా తిరగవలసి వచ్చింది! దాని సాహసములు వినండి మరి!

Duration:00:08:12

కోయిల గడియారం

4/6/2019
More
అది ఒక అద్భుతమయిన కోయిల గడియారం! ఆ గడియారంలో గంటకోసారి నిజమయిన కోయిల వచ్చి కూడా కూస్తుంది. మాలకి అదంటే ఏంటో ప్రాణం! తన రోజు గడవాలంటే ఆ కోయిల కూయాల్సిందే మరి! ఆ కోయిల బద్దకిస్తే ఏమయిందో వినండి మరి!

Duration:00:04:39

బొమ్మల పిన్ని

4/2/2019
More
ప్రేమ పంచడానికి అయినవారే కానక్కర్లేదు. ఒక వీధి వ్యాపారి బొమ్మల పిన్నిగా మారి పిల్లలకి నచ్చిన బొమ్మలని ఇవ్వడమే కాకుండా, వారి అందమయిన భవిత గురించి కలలు కనే ప్రోత్సాహం ఇచ్చేది. మీ జీవితంలో అలాంటి బొమ్మల పిన్నిలు కచ్చితంగా ఉండే ఉంటారు, ఈ కథ విని వారిని స్మరించుకోండి. మీ వూరు వెళితే వారిని పలకరించండి. With Background Music Without Background Music

Duration:00:17:01

కాబూలీవాలా [ Kabuliwala ]

3/30/2019
More
ఒక కాబూలీ వాడు కలకత్తా వీధుల్లో తినుబండారాలు అమ్ముకునే వాడు. అతను మిని అన్న పాపతో చేసిన స్నేహమే ఈ కథ. ఆత్మీయత, బంధం పెనవేసుకున్న కథ ఇది. ఠాగూర్ గారిని విశ్వకవి అని ఎందుకు అంటారో బహుశా ఈ కథ వింటే మనకి నిరూపణ అవుతుంది కాబోలు! With Background Music Without Background Music

Duration:00:21:40

చిన్న ఎర్రబడి [ A Small Redcart]

3/24/2019
More
ఒక చిట్టడివిలో రెండు పిల్లకోతులు చిరు అల్లరి చేస్తుంటే వాళ్ళ అమ్మ కోతి ఒక సలహా ఇచ్చింది. మొదట ఆ సలహా నచ్చకపోయినా తరువాత వారు ఆ సలహా పాటించడమే కాకుండా ఒక అద్భుతంచేసి తల్లిని ఎంతో ఆనందింపచేసారు! ఆ అద్భుతం ఏమిటో వింటే కానీ తెలీదు మరి!

Duration:00:03:56

సూర్యకన్యలు [ Damsels of Sun ]

3/20/2019
More
అది ఒక అందమయిన ఆకాశం. ఆకాశంలో ఎర్రని సూర్యుడు వెలుగును విరజిమ్ముతున్నాడు. ఆ వెలుగు రేకలు ఒక్కొక్కటి ఒక్కొక్క అందమయిన సూర్య కన్యలుగా మారి భూమి మీద పడుతున్నారు! ఆ సూర్యకన్యలకు వచ్చిన ఒక వింత కోరిక ఫలితమే ఈ కథ! విని ఆనందిస్తారు కదూ?

Duration:00:09:20

రామాయణం ఉత్తరకాండ - సమాప్తం

2/20/2019
More
లవకుశలు రామ కీర్తన చేస్తున్నారు. రాముడు వారు సీత కొడుకులని గుర్తించాడు. వాల్మీకి మహర్షికి సీతను తన పవిత్రత నిరూపించుకోమని, అయోధ్యకు పిలిపించాడు. సీత తానూ కల్మషం లేనిదైతే భూమాత వచ్చి తనను తీస్కెళ్లిపోతుందని కోరింది. వెంటనే భూమాత సీత దేవిని తీస్కువెళ్లిపోయింది. లక్ష్మణ, భరత, శత్రుజ్ఞులు తమ తమ పిల్లలకు రాజ్యభారాలు అప్పగించేశారు. రాముడు రాజ్యాన్ని లవకుశలకు అప్పగించి అవతారం చాలించారు. సర్వేజనా సుఖినోభవంతు!

Duration:00:28:40

రామాయణం ఉత్తరకాండ – 12

2/20/2019
More
రాముడు అశ్వమేధ యాగం చేయతలిచాడు. అశ్వ మీద యాగ ఫలితములు చర్చించుకుంటూ ఇలుడు స్త్రీగా మారుట, అశ్వమేధ యాగం చేసి తిరిగి పురుషుడిగా మారుట వంటి విశేషములు చర్చించుకుని వనరులను, రాక్షసులను పిలిచి అశ్వమేధ యాగం చేశారు.

Duration:00:32:41

రామాయణం ఉత్తరకాండ – 11

2/20/2019
More
శత్రుజ్ఞుడు అద్భుతమైన యుద్ధం చేసి లావానుడిని చంపేశాడు. కొన్ని రోజులకు ఒక బ్రాహ్మణుడు అకాల మరణం చెందిన తన పుతృడిని రాముడు వద్దకు తీసుకువచ్చిన సారాను వేడాడు. అకాల మరణాలు ఊరికే రావని దేశంలో ఏదయినా యుగధర్మానికి విరుద్దమయిన పని ఏదైనా జరిగితే ఆలా జరుగుతుందని వసిష్ఠ మహాముని సెలవిచ్చారు. అది ఏమిటో దానితో పాటు మరిన్ని సూక్ష్మ కథలు వినండి.

Duration:00:24:42

రామాయణం ఉత్తరకాండ – 10

2/20/2019
More
రాముడు కొలువుదీరి ఉండగా పలు రకాల సమస్యలను పరిష్కరించాడు. ఒకనాడు కొలువుకు నూరుకు పైగా మునులు వచ్చి లవణాసురుడనే రాక్షసుడు తమను బాధపెడుతున్నారని, వాడి బాధనించి విముక్తి కలిగించమని రాముడిని కోరారు. రాముడు శత్రుజ్ఞుడికి యుద్ధ ప్రణాళిక వివరించి యుద్దానికి పంపాడు.

Duration:00:25:11

రామాయణం ఉత్తరకాండ – 9

2/20/2019
More
వాల్మీకి మహర్షి సీతను ఆదరించి ఋషి కన్యలతో కలిసి ఉండమని సెలవిచ్చాడు. రాముడు వియోగంలో మునిగిపోయాడు. సీత రాములకు ఎందుకీ వియోగం అని లక్ష్మణుడు సుమంత్రుడితో అనగా, సుమంత్రుడు భృగుమహర్షి శాపం గురించి చెప్పాడు. రాముడు వియోగంతో బాధపడుతూ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని చింతిస్తూ లక్ష్మణుడితో అది చాలా తప్పు అని, ఉదాహరణకు కొన్ని కథలు చెప్పాడు.

Duration:00:13:32

రామాయణం ఉత్తరకాండ – 8

2/20/2019
More
అగస్త్యుడు రామునికి వాలి సుగ్రీవుల పుట్టు పూర్వోత్తరాలు చెప్పాడు. సీత గర్భవతి అయింది, రాముడు కోరిక ఎమన్నా కోరామని అడుగగా, సీత ఋషుల ఆశ్రమాలు చూడాలని ఉంది అనగా రాముడు సరే అన్నాడు. ఈలోగా పురప్రజలు చేసే అపవాదులు విన్నాడు. ఆ అపవాదు ఇక్ష్వాకు వంశానికి చేటు అని గ్రహించి సీతను అడవులలో వదిలేసి రమ్మని ఆదేశించాడు.

Duration:00:13:53