Chandamama Ramayanam-logo

Chandamama Ramayanam

Storytelling Podcasts >

More Information

Location:

United States

Twitter:

@kadachepta

Language:

Telugu


Episodes

రామాయణం ఉత్తరకాండ - సమాప్తం

2/20/2019
More
లవకుశలు రామ కీర్తన చేస్తున్నారు. రాముడు వారు సీత కొడుకులని గుర్తించాడు. వాల్మీకి మహర్షికి సీతను తన పవిత్రత నిరూపించుకోమని, అయోధ్యకు పిలిపించాడు. సీత తానూ కల్మషం లేనిదైతే భూమాత వచ్చి తనను తీస్కెళ్లిపోతుందని కోరింది. వెంటనే భూమాత సీత దేవిని తీస్కువెళ్లిపోయింది. లక్ష్మణ, భరత, శత్రుజ్ఞులు తమ తమ పిల్లలకు రాజ్యభారాలు అప్పగించేశారు. రాముడు రాజ్యాన్ని లవకుశలకు అప్పగించి అవతారం చాలించారు. సర్వేజనా సుఖినోభవంతు!

Duration:00:28:40

రామాయణం ఉత్తరకాండ – 12

2/20/2019
More
రాముడు అశ్వమేధ యాగం చేయతలిచాడు. అశ్వ మీద యాగ ఫలితములు చర్చించుకుంటూ ఇలుడు స్త్రీగా మారుట, అశ్వమేధ యాగం చేసి తిరిగి పురుషుడిగా మారుట వంటి విశేషములు చర్చించుకుని వనరులను, రాక్షసులను పిలిచి అశ్వమేధ యాగం చేశారు.

Duration:00:32:41

రామాయణం ఉత్తరకాండ – 11

2/20/2019
More
శత్రుజ్ఞుడు అద్భుతమైన యుద్ధం చేసి లావానుడిని చంపేశాడు. కొన్ని రోజులకు ఒక బ్రాహ్మణుడు అకాల మరణం చెందిన తన పుతృడిని రాముడు వద్దకు తీసుకువచ్చిన సారాను వేడాడు. అకాల మరణాలు ఊరికే రావని దేశంలో ఏదయినా యుగధర్మానికి విరుద్దమయిన పని ఏదైనా జరిగితే ఆలా జరుగుతుందని వసిష్ఠ మహాముని సెలవిచ్చారు. అది ఏమిటో దానితో పాటు మరిన్ని సూక్ష్మ కథలు వినండి.

Duration:00:24:42

రామాయణం ఉత్తరకాండ – 10

2/20/2019
More
రాముడు కొలువుదీరి ఉండగా పలు రకాల సమస్యలను పరిష్కరించాడు. ఒకనాడు కొలువుకు నూరుకు పైగా మునులు వచ్చి లవణాసురుడనే రాక్షసుడు తమను బాధపెడుతున్నారని, వాడి బాధనించి విముక్తి కలిగించమని రాముడిని కోరారు. రాముడు శత్రుజ్ఞుడికి యుద్ధ ప్రణాళిక వివరించి యుద్దానికి పంపాడు.

Duration:00:25:11

రామాయణం ఉత్తరకాండ – 9

2/20/2019
More
వాల్మీకి మహర్షి సీతను ఆదరించి ఋషి కన్యలతో కలిసి ఉండమని సెలవిచ్చాడు. రాముడు వియోగంలో మునిగిపోయాడు. సీత రాములకు ఎందుకీ వియోగం అని లక్ష్మణుడు సుమంత్రుడితో అనగా, సుమంత్రుడు భృగుమహర్షి శాపం గురించి చెప్పాడు. రాముడు వియోగంతో బాధపడుతూ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని చింతిస్తూ లక్ష్మణుడితో అది చాలా తప్పు అని, ఉదాహరణకు కొన్ని కథలు చెప్పాడు.

Duration:00:13:32

రామాయణం ఉత్తరకాండ – 8

2/20/2019
More
అగస్త్యుడు రామునికి వాలి సుగ్రీవుల పుట్టు పూర్వోత్తరాలు చెప్పాడు. సీత గర్భవతి అయింది, రాముడు కోరిక ఎమన్నా కోరామని అడుగగా, సీత ఋషుల ఆశ్రమాలు చూడాలని ఉంది అనగా రాముడు సరే అన్నాడు. ఈలోగా పురప్రజలు చేసే అపవాదులు విన్నాడు. ఆ అపవాదు ఇక్ష్వాకు వంశానికి చేటు అని గ్రహించి సీతను అడవులలో వదిలేసి రమ్మని ఆదేశించాడు.

Duration:00:13:53

రామాయణం ఉత్తరకాండ – 7

2/20/2019
More
కార్తవీర్యార్జునిడి చేతిలో ఓడిన రావణుడికి ఇంకా మదం అణగలేదు. ప్రపంచమంతా తిరుగుతూ కనిపించిన వీరులందరితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఒకనాడు కిష్కిందకు వెళ్లి వాలిని సవాలు చేసాడు. వాలి రావణుడిని చంకనపెట్టుకుని నాలుగు దిక్కులా సముద్రాలలో ముంచి లేపాడు. రావణుడు వాలికి క్షమాపణ చెప్పుకుని అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నాడు. రాముడు హనుమను తలుస్తూ అంతటి మహాబలవంతుడు సుగ్రీవుడికి ఎందుకు సాయం చేయలేకపోయాడని అగస్త్యుడిని అడుగగా, హనుమ అద్భుతశక్తి గురించి ఇలా చెప్పసాగాడు…

Duration:00:11:54

రామాయణం ఉత్తరకాండ - 6

2/20/2019
More
రావణుడి ఆగడాలకు హద్దు లేదు. ముల్లోకాలూ తిరుగుతూ యుద్ధం అందరితోనూ యుద్ధం చేసి గెలిచాడు. మార్గమున కనిపించిన అందగత్తెలు చెరపడుతూ అల్లకల్లోలం చేస్తున్నాడు. ఒకనాడు రంభ తారసపడితే బలవంతంగా చెరపట్టాడు, అది విని నలకూబరుడు “తనను కోరని స్త్రీని బలాత్కరిస్తే రావణుడికి తలా వెయ్యి చెక్కలవుతుంది” అని శపించాడు. రావణుడి విజయ పరంపరను కార్తవీర్యార్జునుడు అనే వీరుడు నిలదీసాడు.

Duration:00:12:41

రామాయణం ఉత్తరకాండ - 5

2/19/2019
More
చావును శాసించే యముడికి చావుంటుందా? రావణుడు యముడిని చంపుతా అని యమలోకానికి వెళ్తున్నపుడు నారదుడు ఆతృతగా యుద్ధం చూడటానికి వెళ్ళాడు. యముడికి రావణునిదికి దారుణ యుద్ధం జరిగింది. ముల్లోకాలూ తల్లకిందులయ్యాయి.

Duration:00:11:52

రామాయణం ఉత్తరకాండ - 4

2/19/2019
More
రావణుడికి కుబేరుడికి భయంకర యుద్ధం జరిగింది.రావణుడు మాయ యుద్ధం చేసి కుబేరుడిని ఓడించి పుష్పక విమానంలో శరవనానికి వెళ్తుండగా మార్గ మద్యంలో శివలోకం వచ్చింది. నంది రావణుడిని ఆపగా రావణుడు శివలోకాన్నే పెకలిస్తా అని కొండని ఎత్తపోయాడు. .

Duration:00:33:09

రామాయణం ఉత్తరకాండ - 3

2/19/2019
More
రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మ నించి వరాలు పొందిన సంగతి పాతాళంలో ఉన్న సుమాలికి తెలిసింది. వెంటనే రాక్షసులను వెంటబెట్టుకుని రావణ వద్దకు వచ్చారు. రావణుడికి లంకను తిరిగి సంపాదించామని నూరిపోశారు.

Duration:00:15:17

రామాయణం ఉత్తరకాండ - 2

2/19/2019
More
సుకేశుడి పుత్రులయిన మాల్యవంతుడు, మాలీ, సుమాలి లంకలో నివాసం ఏర్పరచుకుని వార గర్వంతో ముల్లోకాలనూ క్షోభపెట్టసాగారు. దేవతలందరూ విష్ణుమూర్తి వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, విష్ణువు వారిని సంహరిస్తా అని అభయమిచ్చాడు.

Duration:00:12:51

రామాయణం ఉత్తరకాండ - 1

2/19/2019
More
రాముని పట్టాభిషేకం అయ్యి రాజ్య పాలన చేస్తుండగా అగస్త్య మహాముని అయోధ్య వచ్చారు. మునులందరూ ఇంద్రజిత్తుని లక్ష్మణుడితో సంహరించిన వైనం తమకు ఆశ్చర్యం కలిగించిందని అనేసరికి రాముడికి ఆశ్చర్యం కలిగి ఇంద్రజిత్తుని వృత్తాంతం చెప్పమని కోరాడు. దానికి అగస్త్యుడు ఇలా చెప్పసాగాడు.

Duration:00:12:47

రామాయణం యుద్ధకాండ సమాప్తం!

2/16/2019
More
విభీషణుడు పుష్పక విమానంలో సీతారామ, లక్ష్మణులను అయోధ్య కు తీసుకువెళ్లబోతూ సీత కోరిక మేరకు మార్గమధ్యంలో కిష్కిందలో ఆగి సుగ్రీవుడి భార్యలను, ఇతర వానరప్రముఖులను అయోధ్యకు తీసుకువెళ్లారు. భరతుడు ఎంతో మర్యాదతో, వైభవంగా రాముని పట్టాభిషేకం చేశారు. రామరాజ్యం ఏర్పడింది. యుద్ధకాండ సమాప్తం

Duration:00:12:59

రామాయణం యుద్ధకాండ - 13

2/16/2019
More
విభీషణ అనుమతి తీస్కుని లంకకి వెళ్లి, రావణ సంహారం చేసానని సీతకి చెప్పమని రాముడు హనుమకు చెప్పాడు. సీతను రాముడి వద్దకు చక్కగా అలంకరించి తీసుకువచ్చారు. పరాయి వాడి దగ్గర అంత కాలం ఉన్న సీతను స్వీకరించను అన్నాడు. సీత అగ్ని ప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. ఇంకా అంత శుభమే!

Duration:00:12:18

రామాయణం యుద్ధకాండ - 12

2/15/2019
More
లక్ష్మణుడు కొనప్రాణంతో ఉండగా, హనుమంతుడిని ఔషధీ పర్వతంపై ఉన్న ఔషదములు దొరక్క ఏకంగా పర్వతాన్నే పెకలించి యుద్ధరంగానికి తీసుకువచ్చాడు. ఆ ఔషదములకు లక్ష్మణుడికి ప్రాణం వచ్చింది. రెట్టించిన ఉత్సాహంతో రాముడు యుద్ధం ప్రారంభించాడు. అలా ఏడూ రాత్రులూ ఏడూ పగళ్ళూ యుద్ధం చేశారు. రాముడు దేవతలిచిన దివ్యమైన బాణాన్ని సాధించగా అది దుష్ట రావణుడి ప్రాణాలు హరించింది.

Duration:00:34:10

రామాయణం యుద్ధకాండ - 11

2/14/2019
More
నికుంభుల హోమం చేస్తున్న ఇంద్రజిత్తును ఎవరైతే అడ్డగిస్తారో, వారి చేతిలోనే ఇంద్రజిత్తుకి చావు ఉందన్న విషయం విభీషణుడు రాముడుతో చెప్పాడు. దాంతో రాముడు, లక్షమునిడిని వెళ్ళమని అన్నాడు. లక్ష్మణుడికి, ఇంద్రజిత్తుకు, వనరులకు, రాక్షసులకు భయంకరమయిన యుద్ధం జరుగగా లక్ష్మణుడు ఒక తీవ్రమయిన బాణంతో ఇంద్రజిత్తును సంహరిస్తాడు.

Duration:00:10:55

రామాయణం యుద్ధకాండ - 10

2/12/2019
More
కుంభకర్ణుడు, అకంపనుడు, అతికాయుడు, మకరాక్షుడు తదితర రాక్షసులందరూ చచ్చారు. ఇంద్రజిత్ రామ లక్ష్మణులను అంతమొందిస్తానని రావణుడికి ప్రమాణం చేసి భీకర యుద్ధం చేయనారంభించాడు.

Duration:00:11:05

రామాయణం యుద్ధకాండ - 9

2/11/2019
More
సుగ్రీవుడు మూర్ఛనించి లేచి కుంభకర్ణుడి చెవులు చెక్కిళ్ళు కొరికేసి ఒక్క గెంతులో రాముడు వద్దకు ఎగిరాడు. కుంభకర్ణుడు రగిలిపోయి రామదండు మీదకు దండెత్తాడు. దొరికిన వారిని దొరికినట్టు తినేస్తున్నాడు.

Duration:00:09:24

రామాయణం యుద్ధకాండ - 8

2/10/2019
More
కుంభకర్ణుడు అతి భయంకరంగా యుద్ధం చేయనారంభించాడు. వానర ప్రముఖులను చిత్తుగా ఓడించాడు. హనుమంతుడు వంటి పరాక్రమవంతులు కూడా కుంభకర్ణుడి శక్తికి పడిపోయారు. కుంభకర్ణుడు సుగ్రీవుడిని మూర్ఛపుచ్చి లంకకు తీసుకువెళ్లాడు.

Duration:00:31:41