Abhaya Ayurveda Telugu Podcast-logo

Abhaya Ayurveda Telugu Podcast

Medical

Abhaya Ayurveda is a podcast series to give you tips from all the natural resources

Location:

United States

Description:

Abhaya Ayurveda is a podcast series to give you tips from all the natural resources

Language:

English


Episodes
Pídele al anfitrión que permita compartir el control de reproducción

కాకరకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనలో మీకు తెలుసా| Abhaya Ayurveda | Dr. B.Vijaya Laxmi | Bitter Guard

8/16/2023
కాకరకాయ అని చెప్పగానే.. వామ్మో.. ఆ కర్రీ వద్దులేనని చెప్పేస్తారు చాలామంది. అంత చేదు తినడం మనతో కాదులేనని అంటుంటారు. కానీ కాకరకాయ తింటే.. వచ్చే చేదు కంటే.. దాని నుంచి శరీరానికి జరిగే మంచే ఎక్కువగా ఉంటుంది. తినే ఆహారంలో చేదు అంటే.. చాలామంది ఇక అక్కడ నుంచి తప్పుకుంటారు. తర్వాత తింటానులేనని వెళ్లిపోతారు. కాకరకాయ లాంటి కర్రీని తినేందుకు విసుక్కుంటారు. కానీ ఈ చేదు.. ఆరోగ్యానికి ఎంతో మంచి అనే విషయాన్ని మాత్రం మరిచిపోతారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికన్ దేశాలలో ఒక ప్రసిద్ధ కూరగాయ కాకరకాయ. చేదు రుచి ఉన్నప్పటికీ వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం శతాబ్దాలుగా వాడుతుంటారు కొంతమంది.

Duración:00:07:51

Pídele al anfitrión que permita compartir el control de reproducción

కేవలం 1 రూపాయి కి లభించే నిమ్మలో ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా | Dr.Bavanari Vijayalakshmi | Dwani

6/27/2023
కేవలం 1 రూపాయి కి లభించే నిమ్మలో ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా | Dr.Bavanari Vijayalakshmi | Dwani Voice Services

Duración:00:10:57

Pídele al anfitrión que permita compartir el control de reproducción

కందగడ్డ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా | Abhaya Ayurveda | Telugu Podcasts

6/13/2023
· మూలశంఖకు (పైల్స్) కందతో మందు: పై పొట్టు తీసిన కందను పల్చని ముక్కలుగా కోసి ఎండబెట్టి మెత్తటి పొడిగా చేయాలి. బెల్లాన్ని కూడ మెత్తగా చేయాలి. ఈ రెండు పొడులను సమభాగాలుగా కలబోసి బాగా కలిపి, ఉసిరికాయ పరిమాణంలో వుండలుగా కట్టి (లడ్డు లా) నిల్వ చేసుకొని ప్రతి రోజు పొద్దున ఒకటి, రాత్రికి ఒకటి చొప్పున తింటే మూలశంఖ వ్వాది నయమవుతుందని ఆయుర్వాద వైద్యులు అంటారు. · కొన్ని ద్రవ్యాలలో (ఈ ద్రవ్యాలు ఏమిటో తెలియదు) నానబెట్టి, ఎండబెట్టిన కంద ముక్కలని "మదన్ మస్త్" అన్న పేరుతో బజారులో అమ్ముతూ ఉంటారు. దీనిని మూలశంఖకీ, అజీర్తికీ మందుగా వాడతారు. · మదన్ మస్త్, చిత్రమూలం (ప్లంబాగో జైలానికం) వేరు, శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, బెల్లపు పాకం - వీటన్నిటిని సమ పాళ్లల్లో కలిపి చేసే "సూరణ మాదకం" అనే లేహ్యం అజీర్తి రోగాన్ని చక్కగా కుదుర్చుతుందని డా. నద్‌కర్ణి "The Indian Materia Medica" అనే గ్రంథంలో పేర్కొన్నారు ట.

Duración:00:08:58

Pídele al anfitrión que permita compartir el control de reproducción

అవిస గింజలు తింటే ఎన్ని ఆరోగ్య లాభాలు తెలుసా? | Abhaya Ayurveda Telugu Podcast

6/4/2023
అవిస గింజలు తింటే ఎన్ని ఆరోగ్య లాభాలు తెలుసా? | Abhaya Ayurveda Telugu Podcast

Duración:00:09:36

Pídele al anfitrión que permita compartir el control de reproducción

మనం చిన్ననాటి నుండి తింటున్న బఠానీల్లో ఇన్ని లాభాలు ఉన్నాయా

4/29/2023
బిర్యానీ దగ్గర నుంచి రోడ్ సైడ్ దొరికే ఛాట్ వరకు పచ్చి బఠానీ వేయకుండా ఉండరు. చాలా మంది వాటిని ఏరి పక్కన పెట్టేస్తారు. మంచి రంగు, రుచి కారణంగా వాటిని కొంతమంది తింటారు కానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాత్రం చాలా తక్కువగా తెలుసు. పచ్చి బఠానీలు లెగ్యూమ్ కుటుంబానికి చెందినవి. చలికాలంలో వీటిని తినడం వల్ల శరీరానికి అనేక లాభాలు చేకూరతాయి. ఇందులో విటమిన్ ఏ, బి, సి, ఇ, కె తో పాటు అనేక పోషకాలు ఉన్నాయి. పొటాషియం, ఫైబర్, జింక్ లభించే మంచి మూలం ఇవి ఆహారం రుచిని పెంచడమే కాదు ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తాయి.

Duración:00:06:27

Pídele al anfitrión que permita compartir el control de reproducción

నేటి కాలంలో ఊబకాయం ఎందుకు వస్తుంది ? దాన్ని అరికట్టడం ఎలా ?

4/3/2023
నేటి కాలంలో ఊబకాయం ఎందుకు వస్తుంది ? దాన్ని అరికట్టడం ఎలా ?

Duración:00:10:24

Pídele al anfitrión que permita compartir el control de reproducción

పిప్పలి అంటే ఏంటి ? దానిని ఎలా వాడుతారు. పిప్పలి వాళ్ళ మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి?

2/14/2023
పిప్పలి గురించి ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు. ఆయుర్వేదంలో దాని ఔషధ, ఆహార గుణాలను వివరించారు. ఇది సా.పూ. ఆరవ లేదా ఐదవ శతాబ్దంలో గ్రీస్‌కు చేరుకుంది. అయితే హిప్పోక్రేట్స్ దీనిని మసాలాగా కాకుండా ఔషధంగా భావించాడు. కొలంబియన్ మార్పిడికి ముందు, గ్రీకులు, రోమన్లకు పిప్పలి ఒక ముఖ్యమైన, ప్రసిద్ధమైన మసాలా దినుసుగా ఉండేది.

Duración:00:08:57

Pídele al anfitrión que permita compartir el control de reproducción

ప్రతి కాలంలో దొరికే ఆరటి వాళ్ళ ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా ?

1/17/2023
ప్రతి కాలంలో దొరికే ఆరటి వాళ్ళ ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా ?

Duración:00:10:43

Pídele al anfitrión que permita compartir el control de reproducción

శీతాకాలంలో ఆయుర్వేదం ప్రకారం మనం తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

12/19/2022
ఏ కాలంలోనైనా ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. శీతాకాలంలో కూడా పలు రకాల వ్యాధులు ప్రజలను భయపెడుతుంటాయి. శీతాకాలంలో గుండె జబ్బులు విజృంభిస్తాయి. హృదయ సంబంధ వ్యాధులు ఉన్న వారు ఈ కాలంలో జాగ్రత్తలు పాటించాల్సిందే. మన దేశంలో కూడా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు ఘనంగా తగ్గుతాయి. ఒక సమయంలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతుంటాయి.దీంతో ఈ కాలంలో మనం అప్రమత్తంగా ఉంటే రోగాల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. శీతాకాలంలో చల్లని పదార్థాలు తినకూడదు. వేడిగా ఉన్నప్పుడే తింటే మంచిది. ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. చలికాలంలో రక్తపోటులో కూడా హెచ్చుతగ్గులు రావడం సహజమే. దీంతో వేడిగా ఉన్న ఆహార పదార్థాలనే తీసుకుంటే ప్రయోజనం. బయటకు వెళ్లేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలు స్వెటర్లు వేసుకుంటేనే చలి నుంచి రక్షణ కలుగుతుంది. వృద్ధులు కూడా వేడిగా ఉండేందుకు ఉన్ని దుస్తులు ధరించడం శ్రేయస్కరం. దీంతో వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు వీలవుతుంది. కూల్ డ్రింక్స్, తీపి పదార్థాలు, చల్లనివి తీసుకోకూడదు. సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉంటేనే మేలు కలుగుతుంది. ఉష్ణోగ్రతను పెంచుకునేందుకు కాఫీ, టీ వంటివి తాగుతూ శరీరాన్ని వేడి చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువా ఉండటంతో దాని నుంచి రక్షించుకునేందుకు పలు దుస్తులు ధరిస్తేనే మంచిది. చలి నుంచి రక్షించుకునేందుకు పలు మార్గాలు అన్వేషించాలి. చలి తీవ్రతతో పలు రోగాలు విజృంభించే వీలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే.

Duración:00:09:40

Pídele al anfitrión que permita compartir el control de reproducción

మనం రోజువారీ జీవితంలో వాడుతున్న లవంగంలో ఉన్న గుణాలు, వాటి ప్రాముక్యత ఏంటో తెలుసుకుందాం

11/14/2022
లవంగాల్లోని యుజెనాల్‌ అనే రసాయనానికి అద్భుత ఔషధ, పోషక విలువలు ఉన్నాయి. యుజెనాల్‌ కఫానికి విరుగుడుగా పనిచేస్తుంది. పంటినొప్పితో బాధపడేవాళ్లు ఓ లవంగవెుగ్గను బుగ్గన పెట్టుకుంటే వెంటనే తగ్గుతుంది. నోటి దుర్వాసననీ పోగొట్టి శ్వాసని తాజాగా ఉంచుతుంది. లవంగాలను నీళ్లలో మరిగించి తాగడంవల్ల అజీర్తి, తలతిరగడం, వాంతులు, అలసట వంటివి తగ్గుతాయి. అంతేకాదు, ఫ్లూ, జలుబు, సైనసైటిస్‌, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్‌ వంటివి కూడా తగ్గుముఖం పడతాయి. లవంగనూనెలో దూదిని ముంచి దంతాలు, చిగుళ్లులో నొప్పి వచ్చేచోట పెడితే ఇట్టే తగ్గిపోతుంది. పెద్దపేగులోని పరాన్నజీవుల్నీ సూక్ష్మజీవుల్నీ లవంగంలోని 'యుజెనాల్‌' నాశనం చేస్తుంది. అందుకే డయేరియా, నులిపురుగులు, జీర్ణసంబంధిత రుగ్మతలకి లవంగం మంచి మందు. రెండు లవంగాల్ని బుగ్గనపెట్టుకుని నమిలితే మద్యం తాగాలన్న కోరిక మాయమవుతుందట. రెండుమూడు లవంగాలకు కొంచెం పంచదార చేర్చి నూరి చల్లటినీళ్లలో కలిపి తాగితే గుండెల్లో మంట వెంటనే తగ్గుతుంది. జలుబుతో బాధపడేవాళ్లు కర్చీఫ్‌మీద రెండుమూడు చుక్కల లవంగనూనెని చల్లి వాసన పీలిస్తే ఫలితం ఉంటుంది. దగ్గు ఎక్కువగా ఉన్నపుడు .. టీలో శొంఠికి బదులు లవంగాలు వేసి తాగిన ఉపశమనం కలుగుతుంది .

Duración:00:08:38

Pídele al anfitrión que permita compartir el control de reproducción

మనం ఎక్కువగా వాడుతున్న మొక్కజొన్న ఉపయోగాలు తెలుసుకుందాం

10/18/2022
మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మొక్కజొన్న తెలియని వారు ఉండరంటే అతిశయోక్తే. ఎందుకంటే మొక్కజొన్న ఏ దేశములోనైనా అంత ఫేమస్ మరి. మొక్కజొన్న ఒక ముఖ్యమైన ఆహారధాన్యము. ఇది చాలా విరివిగా, అతి చౌకగా లభించే ఆహారం. మొక్కజొన్న గింజలు ఒక మంచి బలమైన ఆహార పదార్ధము. దీని గింజలను పచ్చిగా గాని, కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. మొక్కజొన్న గింజలనుండి పేలాలు 'పాప్ కార్న్', 'కార్న్ ఫ్లేక్స్' తయారుచేస్తారు. లేత 'బేబీకార్న్' జొన్న కంకులు కూరగా వండుకుంటారు. మొక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. మొక్కజొన్న గింజలనుండి నూనె తీస్తారు. ఇన్ని రకాలుగా మొక్కజొన్నను ప్రతి నిత్యం ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటున్నారు.

Duración:00:06:22

Pídele al anfitrión que permita compartir el control de reproducción

ఎన్నో అత్యుత్యమా గుణాలు కలిగి ఉన్న బాదం మనకు ఎలా ఉపయోగపడుతుంది తెలుసుకుందాం!

9/4/2022
బాదంలో మాంసకృత్తులు, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని మిల్క్‌షేక్‌, ఇతర రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు దీనికి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే గుణం ఉంది. గుండెకు : పది బాదం పప్పుల చొప్పున వారంలో ఐదుసార్లు తీసుకొంటే హృద్రోగ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో విటమిన్‌ 'ఇ' ఉంటుంది. ఇది చక్కని యాంటీఆక్సిడెంట్‌. కొలెస్ట్రాల్‌ నియంత్రణ : వీటిలో మోనోశాచ్యురేటెడ్‌, పాలీశాచ్యురేటెడ్‌ ఫ్యాట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడుకొవ్వు నిల్వలను నాశనం చేస్తాయి. అందుకే ప్రతిరోజూ రెండుమూడు బాదంపప్పులను ఉదయాన్నే తీసుకొంటే మంచిది. రక్తప్రసరణ : బాదంలో పొటాషియం ఎక్కువ, సోడియం శాతం చాలా తక్కువ. కాబట్టి రక్తపోటు సమస్య ఉండదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇందులో లభించే మెగ్నీషియం కండరాల నొప్పులను దూరం చేసి ఎదృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఎముకలు దృఢంగా : ఇందులో లభించే క్యాల్షియం ఆస్టియోపోరోసిస్‌ను దూరంగా ఉంచుతుంది. ఎముకలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఇనుము శరీరావయవాలకు, కణాలకు ఆక్సిజన్‌ను చేరవేస్తుంది. బరువుతగ్గడానికి : బాదంలో ఉండే పీచు పదార్థం, మాంసకృత్తులు, కొవ్వులు బరువు తగ్గేవారికి మేలు చేస్తాయి. అంతేకాదు కెలొరీల శాతం తక్కువ కాబట్టి ప్రతిరోజు తీసుకున్నా సమస్య ఉండదు.

Duración:00:08:10

Pídele al anfitrión que permita compartir el control de reproducción

వినాయకుడికి పూజలో వాడే 21 రకాల ఆకులు ఏంటి? వాటి వెనకాల ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏంటి ?

8/30/2022
గణనాధునికి అనేక రకాల పత్రాలతో (ఆకుల) పూజ చేస్తాం. ఔషధ గుణాలున్న ఈ పత్రాలను నవరాత్రులలో ఇంట్లో ఉంచుకున్నందువల్ల పత్రాల నుండి, అలాగే కొత్తమట్టితో తయారుచేసిన గణనాధుడి నుండి ప్రాణవాయువులు వెలువడి ఆ కుటుంబంలోని అందరికి ఆయురారోగ్యాలు పంచుతుంది. ఇది మన పూర్వులైన ఋషులు కనుగొని మనకు నేర్పిన విషయం. దీనిని నేటి మన వైద్యులు కూడా నొక్కి చెబుతున్నారు. నిజానికి వినాయక చవితి పూజలో వాడే పత్రాలన్నీ చెట్టు నుండి విడిపోయిన 48 గంటల వరకు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అంతేకాక వాటిని 9 రోజుల అనంతరం నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటి నుండి వెలువడే ఆల్కలాయిడ్స్ నీటిలోకి చేరి అక్కడి రోగకారక క్రిములను, చెడు పదార్థాలను నాశనం చేస్తాయి. ఆ నీటిలో ప్రాణవాయువు శాతాన్ని పెంచుతాయి. అంతేకాక ఆ పత్రి నుండి వెలువడే సుగంధాన్ని పీల్చడం ద్వారా కూడా స్వస్థత చేకూరుతుంది. పత్రిని చేతితో ముట్టుకోవడం వలన కావలసిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరంలోకి శోషణం చెంది ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. పిల్లలకు పత్రి సేకరణ వలన విజ్ఞానము, వినోదము, పర్యావరణ పట్ల స్నేహ భావము కలుగుతాయి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఔషధ గుణాలు ఉన్నాయి.

Duración:00:14:08

Pídele al anfitrión que permita compartir el control de reproducción

ద్రాక్షపళ్ళు ఇలా తింటే గుండె జబ్బులు మన ధరి చేరటం కష్టం

7/27/2022
వీటిలో ఉండే పోషక పదార్థాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మూత్రపిండాల పనితనం పెరుగుతుంది. కిడ్నీలలో రాళ్లు ఏర్పడవు. అజీర్తి, మల బద్ధకం తగ్గుతుంది. నోరు, గొంతు ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. వీటిలోని అనేక విటమిన్లు, ఖనిజాలు మీ ఆరోగ్యానికి పూర్తి రక్షణ కలిగిస్తాయి. ఏనుగు బతికినా చచ్చినా విలువే అన్నట్లు ఇవి ఎండిన తర్వాత కిస్మిస్‌గా కూడా పోషక విలువలను కోల్పోవు. కేవలం నీటిని తప్ప. వీటిలోని పాలిఫినాల్‌లు కొలెస్టాల్‌ని అదుపు చేయడంలో, క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో సహకరిస్తాయి. వీటిలోని సోడియం, కొవ్వు పదార్ధాలు చాలా తక్కువ. విటమిన్‌ సి, కే చాలా ఎక్కువ.

Duración:00:08:22

Pídele al anfitrión que permita compartir el control de reproducción

ఆయుర్వేద వైద్యంలో అర్జున బెరడుకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ?

6/20/2022
తెల్ల మద్ది (లాటిన్ Terminalia arjuna) భారతదేశంలో పెరిగే కలప చెట్టు. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది.దీనిని అర్జున పత్రి అని కూడా అంటారు. దీనిని ‘మద్ది’ అని కూడా అంటారు. ఇది తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. దీని బెరడు అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుందని పరిశోధనలు నిరూపించాయి.ఆధునిక పరిశోధనలలో కూడా ఇది :కార్డియాక్ టానిక్" గా ఉపయోగపడుతున్నట్లు కనుగొన్నారు. ఇది ఇతర రకాలైన నొప్పులలో ఉపయోగపడుతుంది. తెల్ల మద్ది రక్తంలో కొలెస్టిరాల్ అధికంగా ఉన్నవారికి ఉపయోగపడుతుంది. ఈ ప్రయోజనాలు ఏంటీ ఆక్సిడెంటు లక్షణాలు కలిగిన ఫ్లేవనాయిడ్ల వలన అని తెలుస్తున్నది. ఇదే కాకుండా నొప్పి మందుల వలన కడుపులో పుండు నుండి రక్షిస్తుంది.

Duración:00:08:51

Pídele al anfitrión que permita compartir el control de reproducción

కాల్షియం లోపం, సంకేతాలు మరియు లక్షణాలు ఏంటి ? వటినీ అరికట్టటం ఎలా ?

5/30/2022
కాల్షియం జీవులన్నింటికి ముఖ్యమైనది. జీవుల శరీరంలో అన్నింటికన్నా ఎక్కువగా ఉండే లోహము. ఇది ముఖ్యంగా ఎముకలలో ఉంటుంది. జీవుల దేహవ్యవస్థలో కాల్షియం ప్రముఖపాత్ర కలిగివున్నది. ముఖ్యంగా కణనిర్మాణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది. కాల్షియం యొక్క అయానులు, జీవ కణజాలంలో సైటో ప్లాజంలో లోపలికి, బయటకు ప్రయాణిస్తూ, కణాల జీవ నిర్వహణలో భాగం వహిస్తాయి. పళ్ళు/దంతాలు, ఎముకలు, కొన్ని జీవుల (నత్త, అలిచిప్పజాతి జీవుల) పై పెంకుల నిర్మాణంలో కాల్షియం ఉనికి ప్రముఖమైనది.జీవజాలాలన్నింటిలో ఎక్కువ ప్రమాణంలో లభ్యమైయ్యే మూలకం కాల్షియం .

Duración:00:09:20

Pídele al anfitrión que permita compartir el control de reproducción

బహిష్ఠు నియమాలు పాఠించడం వలన లాభమా?నష్టమా? Abhaya Ayurveda Ep-35

5/9/2022
యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలు మొట్టమొదటిగా బహిష్టు లేదా ఋతుస్రావం అవడాన్ని రజస్వల లేదా పుష్పవతి (Menarche) అవడము అంటారు. సాధారణముగా రజస్వల వయసు 9 నుంచి 12 సంవత్సరాలు. బహిస్టులు ప్రతినెలా 28 రోజులకు వస్తూ ఉంటాయి. ఇలా జరగడానికి ఈస్త్రోజన్, ప్రొజిస్ట్రోన్ అనే హార్మోనులు కారణం. ఇవి ఆడువారి హార్మోనులు, వీటివలనే అండాశయము నుండి అండము ప్రతినెలా విడుదల అవుతూ ఉంటుంది. బహిస్టులు 45 నండి 50 సంవత్సరముల వరకు అవుతూ ఉంటాయి. తరువాత ఆగిపోతాయి, దీన్నే మెనోపాజ్ అంటారు. మరిన్ని ఆయుర్వేద సలహాలకోసం అభయ ఆయుర్వేద పోడ్కాస్త్స్ ని ఫాలో అవ్వండి

Duración:00:10:36

Pídele al anfitrión que permita compartir el control de reproducción

కొబ్బరి బొండం యొక్క ఉపయోగాలు

4/3/2022
లేత కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువ గాను, క్రొవ్వులు అస్సలుండవు, చెక్కెర పరమితం గాను ఉండును . కొబ్బరి బొండం నీటిలో పొటాసియం ఎక్కువగా ఉంటుంది . శరీరములో నీటి లేమిని (Dehydration) కరక్ట్ చేస్తుంది

Duración:00:06:21

Pídele al anfitrión que permita compartir el control de reproducción

మునగ యొక్క ఉపయోగాలు

4/1/2022
మునగను సాంప్రదాయ వైద్య వ్యవస్థలో రక్తహీనతకు ఒక ఔషధంగా ఉపయోగిస్తారు. ఇటీవలి అధ్యయనాలు మునగ ఇనుము యొక్క అద్భుతమైన మూలం అని సూచిస్తున్నాయి. అదనంగా, మునగాకులు రక్తహీనత వ్యతిరేక (anti-anemic) ప్రభావాలను కలిగి ఉన్నాయని తెలిపాయి

Duración:00:08:19