సమచరం సమకష - A Telugu News Podcast-logo

సమచరం సమకష - A Telugu News Podcast

0 Favorites

ఈ పోడ్కాస్ట్ సిరీస్‌లో చర్చలు, వార్తల సమీక్ష, మరియు మీడియా విమర్శని ప్రసారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తలకు ప్రాధాన్యత ఉంటుంది. మీ సలహాలు, తెలుగులొ మీరు వినాలి అనుకునె విషయాలు గురించిన వివరాలు మాకు తెలపాలి అనుకుంటె, hello@sunoindia.in (mailto:hello@sunoindia.in) కి email పెట్టండి. (Samacharam Sameeksha will bring to you news and views of all the latest developments from Telangana and Andhra Pradesh. The podcast will also analyse news coverage and bring in seldom heard perspectives and will help you cut through the noise. Priority will be given to issues from the two Telugu states. Write into us at hello@sunoindia.in with your suggestions and feedback.)

Location:

United States

Description:

ఈ పోడ్కాస్ట్ సిరీస్‌లో చర్చలు, వార్తల సమీక్ష, మరియు మీడియా విమర్శని ప్రసారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తలకు ప్రాధాన్యత ఉంటుంది. మీ సలహాలు, తెలుగులొ మీరు వినాలి అనుకునె విషయాలు గురించిన వివరాలు మాకు తెలపాలి అనుకుంటె, hello@sunoindia.in (mailto:hello@sunoindia.in) కి email పెట్టండి. (Samacharam Sameeksha will bring to you news and views of all the latest developments from Telangana and Andhra Pradesh. The podcast will also analyse news coverage and bring in seldom heard perspectives and will help you cut through the noise. Priority will be given to issues from the two Telugu states. Write into us at hello@sunoindia.in with your suggestions and feedback.)

Language:

Telugu


Episodes
Ask host to enable sharing for playback control

సిజేరియన్ ప్రసవాలు vs నార్మల్ ప్రసవాలు part 2 (Caeseran delivery Vs Normal delivery part 2)

10/30/2022
ఇవ్వాల్టి పార్ట్ 2 ఎపిసోడ్లో సిజేరియన్ ,నార్మల్ డెలివెరీస్ లో అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమిటి ? తల్లి బిడ్డల ఆరోగ్య రీత్యా ఎలాంటి డెలివరీ ఎలాంటి సందర్భాల్లో మేలు చేస్తుంది ? డెలివరీ సమయాల్లో డాక్టర్స్ ఎదుర్కొనే ఇబ్బందులు presures ఏమిటీ ? అనే అనేక విషయాల గురించి సునో ఇండియా వారి సమాచారం సమీక్ష లో హోస్ట్ చాముండేశ్వరి తో ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ . స్నేహ గారి ఇంటర్వ్యూ లో వినండి . See sunoindia.in/privacy-policy for privacy information.

Duration:00:41:50

Ask host to enable sharing for playback control

సిజేరియన్ ప్రసవాలు vs నార్మల్ ప్రసవాలు part 1 (Caeseran delivery Vs Normal delivery part 1)

10/30/2022
దేశం లో అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్రం సిజేరియన్ ప్రసవాలలో కూడా పెరుగుదల రికార్డు చేసింది . సి. సెక్షన్ డెలివెరీస్ దాదాపు 60% . కొన్ని జిల్లాలో ఇంకా ఎక్కువని రిపోర్ట్స్ . నేషనల్ సగటు 22% కంటే ,WHO permisable రేట్ 10-15 % కంటే ఎక్కువే . గత కొద్దీ కాలం గ తెలంగాణ ప్రభుత్వం సిజేరియన్ ప్రసవాలు తగ్గించి ,నార్మల్ డెలివెరీస్ ను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది . ఈ పరిస్థితికి కారణాలు ఏమిటి ? ప్రజల ఆలోచన ,వైద్య రంగం లో వచ్చిన మార్పా ? ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఎక్కువ ఫీజు వస్తుందనే వాదన నిజమా ? నార్మల్ లేదా సిజేరియన్ ప్రసవాల్లో ఏది ? ఎప్పుడు ? ఎంతవరకు తల్లి బిడ్డకు మంచిది సిజేరిన్ ప్రసవాల తగ్గింపులో ప్రభుత్వం ,ఫామిలీ , డాక్టర్స్ ,ఇతర midwiffery రోల్ ఎంత వరకు ఉంది ? అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎంతవరకు అవసరం ? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం సునో ఇండియా వారి సమాచారం సమీక్షలో హోస్ట్ చాముండేశ్వరి తో ప్రముఖ gynaecologist DR . అనురాధ. m గారి ఇంటర్వ్యూ పార్ట్ వన్ లో వినండి. See sunoindia.in/privacy-policy for privacy information.

Duration:00:39:35

Ask host to enable sharing for playback control

తలసేమియా గురించి ఎందరికి తెలుసు? (How many people know about Thalassemia?)

10/26/2022
రక్తం అంటే ఎర్రని రంగని తెలుసు . రక్తం చూస్తే ఆందోళన , భయం కలగటం natural . రక్తం లో ఉన్న groups, classifications గురించిన అవగాహన అందరికి లేదు . అలాంటిది జన్యు పరమైన blood related వ్యాధుల గురించి తలసేమియా గురించి ఎందరికి తెలుసు? ప్రజలలో అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మే 8 వ తేదీన ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. తలసేమియా అనేది జన్యు రక్త రుగ్మత, . తలసేమియా ఉన్న పిల్లవాడు అలసట, బలహీనత, నెమ్మదిగా పెరుగుదల, పేలవమైన ఆకలి మరియు రక్తహీనత వంటి లక్షణాలను చూపుతాడు. చికిత్స రక్త మార్పిడితో ఉంటుంది, దీని వల్ల కుటుంబంపై మానసిక మరియు ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది. తలసేమియా అంటే గ్రీక్ భాషలో సముద్రం అని అర్థం. ఈ వ్యాధికి గురైన చిన్నారికి జీవితాంతం రక్తం ఎక్కిస్తూనే ఉండాలి. తలసేమియా రోగుల్లో శరీరానికి అవసరమైనంత హిమోగ్లోబిన్‌ ఉత్పత్తి కాదు. ఒకవేళ ఉత్పత్తయినా ఎక్కువకాలం ఉండదు. హిమోగ్లోబిన్‌ నిల్వలు పడిపోయిన ప్రతిసారీ హిమోగ్లోబిన్‌ని కృత్రిమంగా రక్తం ద్వారా అందించాలి. నివేదికల ప్రకారం, ప్రతి సంవత్సరం సగటున 10,000 మంది పిల్లలు తలసేమియాతో జన్మిస్తున్నారు మరియు జనాభాలో 3-4% మంది క్యారియర్లు. అందువల్ల, తల్లిదండ్రుల ఇద్దరికీ సమగ్ర జన్యు పరీక్ష యొక్క అవగాహన పెంచడం చాలా అవసరం.ప్రీ-నాటల్ టెస్టింగ్ మరియు క్యారియర్ స్క్రీనింగ్ అవసరం తలసేమియా కేసులను నివారించడానికి కీలకం పనిచేస్తుంది. రక్తం పంచుకుని పుట్టిన పిల్లలకు తమకు తెలియని , నివారణ లేని ,లైఫ్ లాంగ్ రక్త మార్పిడి అవసరం అయ్యే తలసేమియా లాంటి అనారోగ్యం వస్తే రోగి ,కుటుంబం పరిస్థితి ఏంటి ? ఎక్కడికి వెళ్ళాలి ? వైద్యం ఎలా ? రోగ నిర్ధారణ ఎలా ? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవాళ్టి సునో ఇండియా వారి సమాచారం సమీక్షలో హోస్ట్ D .చాముండేశ్వరి తో ప్రముఖ డాక్టర్ అదితి కిశోర్ ఇంటర్వ్యూ లో తెలుసుకుందాము . See sunoindia.in/privacy-policy for privacy information.

Duration:00:43:01

Ask host to enable sharing for playback control

పిల్లలపై లైంగిక దాడులు - పోక్స్కో చట్టం (Child sexual abuse - What does POCSO act say)

10/21/2022
గత కొద్దికాలంగా దేశం లో చిన్నారుల మీద లైంగిక అకృత్యాలు పెరిగిపోతున్నాయి . గర్ల్ లేదా బాయ్ సేఫ్ గ ఉండే పరిస్థితి లేదు . ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా ? పిల్లల ని abuse చేస్తారో తెలియదు . సేఫ్ గ చెప్పబడే స్కూల్ ,ఇల్లు వారి పాలిట నరకం గా మారుతున్నాయా ? పిల్లల అమాయకత్వం ,వయస్సు ని ఆసరాగా తీసుకుని నమ్మించి బెదిరించి సెక్సువల్ గా అబ్యూస్ చేస్తున్న సందర్భాలు అనేకం . abuse అయినా చైల్డ్ మానసిక ,శారీరిక conditions సంగతి ఏమిటీ ? పిల్లలకు safe, unsafe టచ్ గురించి చెప్పటం ఎవరి భాద్యత ? ఎంత ముఖ్యం ? నేరం జరిగినప్పుడు సోషల్ స్టిగ్మా అని భయపడకుండా ఎప్పుడు ఎవరికీ ఎలా రిపోర్ట్ చెయ్యాలి? పిల్లల ప్రవర్తనలో కనపడే మార్పులు ఎలా తెలుసుకోవాలి ? POCSO చట్టం అమలు ఎలా జరుగుతోంది ? పిల్లలు మానసికంగ కుంగిపోయినప్పుడు ఎవరు ఎలా కౌన్సిల్ చేస్తారు ? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవాళ్టి సునో ఇండియా వారి సమాచారం - సమీక్ష లో హోస్ట్ చాముండేశ్వరి తో ప్రముఖ న్యాయవాది , అనేక POCSO కేసుల్లో లీగల్ ఎక్స్పర్ట్ అయిన స్పందన సదాశివుని ఇంటర్వ్యూ లో వినండి . See sunoindia.in/privacy-policy for privacy information.

Duration:01:02:02

Ask host to enable sharing for playback control

ధాన్య సేకరణలో ప్రైవేట్ కి అవకాశం . ఎవరి మేలు కోసం ? (Private players in grains procurement)

9/29/2022
140 కోట్ల జనాభా అందులో దాదాపు 60% వ్యవసాయం వ్యవసాయ ఆధారిత రంగాల్లో పనిచేస్తారని అంచనా . కంట్రీ ఎకానమీ లో అగ్రికల్చర్ వాటా 2021 లెక్కల ప్రకారం 20. 19% . కరోనా పాండమిక్ లో అనేక ఉత్పత్తి రంగాలు తాత్కాలికం గా మూతపడిన , వ్యవసాయ రంగం ఆదుకుందని తెలుసు .రైతే రాజు .లక్షల్లో బ్యాంకు బాలన్స్ ఉండేలా వ్యవసాయ రంగాన్ని నిలుపుతామన్న హామీలు. రైతుల ఆశ లు ఆకాంక్షలకు షాక్ తగిలేలా వ్యవసాయ చట్టాల్లో మార్పులు చేర్పుల మూలంగా అగ్రికల్చర్ ,రైతుల కు దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయన్నది ఎంత నిజం ? కారణం ఏంటి ? అగ్రికల్చర్ లో ఫైనల్ స్టేజి అయినా ధన్య సేకరణ ,మద్దతు ధర , సమయానికి పేమెంట్ ని ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి . పండించిన పంటను రైతు మార్కెటింగ్ చేసుకునే స్థోమత , వీలు ,అనుభవం ఉండకపోవచ్చు . ప్రజలు ఎన్నుకున్న ప్రభు త్వాలే రైతుల పాలిట ఆశాకిరణం . వెల్ఫేర్ స్టేట్ భాద్యత కూడా . అలాంటిది ప్రభుత్వమే ధాన్య సేకరణ ఖర్చు భరించలేము . ప్రైవేట్ వాళ్ళు తక్కువ ధరకే నాణ్యమైన ధాన్యం సేకరిస్తారు అంటే దేశ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందనుకోవాలి ? రైతులకి బేరం ఆడే శక్తి ఉంటుందా ? కనీస మద్దతు ధర సంగతి ఏంటి ? ధాన్య సేకరణ ప్రైవేట్ వాళ్ళు చేస్తే గ్రైన్స్ ప్రాసెసింగ్ , స్టోరేజ్ పంపిణి ఎవరి ఆధీనం లో ఉంటుంది ? అగ్రికల్చర్ లో .ప్రభుత్వం భాధ్యత ఏంటి ? ఆహార భద్రతా చట్టం అమలు సంగతి ఏంటి ? FCI పాత్ర ఏంటి ? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఎలా మారవచ్చు ? రైతులకు , ప్రజలకు లేదా ప్రైవేట్ కి ఎవరికీ లాభం ? ఇవాళ్టి సమాచారం సమీక్షలో హోస్ట్ డి . చాముండేశ్వరి తో తెలంగాణ స్టేట్ రైతు సంఘం జనరల్ సెక్రటరీ పశ్య పద్మ గారి ఇంటర్వ్యూ లో వినండి . See sunoindia.in/privacy-policy for privacy information.

Duration:00:47:30

Ask host to enable sharing for playback control

తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 (Significance of Sept 17 for telangana)

9/17/2022
తెలంగాణ ప్రాంత చరిత్రలో సెప్టెంబర్ 17 కి ఒక గుర్తింపు ,ప్రాముఖ్యత ఉందని అందరికి తెలిసిందే . రైతులు చేసిన తెలంగాణ సాయుధ పోరాటం అంటారు . కమ్యూనిస్టుల ప్రాబల్యం తో 1952 వరకు జరిగిన పోరాటం అంటారు . నిజాం పాలనను వ్యతిరేకిస్తూ చేసిన ప్రజల పోరాటం అంటారు. దేశ స్వతంత్రం కోసం పోరాడినా నిజాం పాలన నుండి ఫ్రీడమ్ దొరకనందున జరిపిన పోరాటం అంటారు. దేశ సమైక్యత లో భాగం కావటానికి జరిపిన పోరాటం లేదా ఆక్షన్ డే అంటే జాతీయ. సమైక్యతా దినం అని ఒకరు తెలంగాణ విమోచన దినం అని అనేక విధాలుగా పిలుస్తూ 75 సంవత్సరాల తరువాత ఘనంగా ఉత్సవాలు నిర్వహణ ప్లాన్ చేసారు . వీరు వారు అని కాదు అన్ని రాజకీయ పార్టీలు సెంటర్ నుండి స్టేట్ వరకు సెలబ్రేషన్స్ ప్లాన్ చేసారు . వారి వారి పార్టీ అవసరానికి తగ్గట్టు ఉత్సవాలు ఉంటాయి . ఎన్నడూ లేనంత గా ప్రజల మధ్యలోకి డిస్కషన్ గా వచ్చింది . అంటే కాదు చాల అయోమయాన్ని కలిగిస్తోంది . అసలు చరిత్రలో ఆరోజు ఏమి జరిగింది ? ఎందుకు జరిగింది ? 75 yrs తరువాత సంఘటనను ఎలా చూడాలి ? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్టి సమాచారం సమీక్ష లో హోస్ట్ చాముండేశ్వరి తో ప్రముఖ పాత్రికేయులు కే . శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూ లో తెలుసుకుందాము . See sunoindia.in/privacy-policy for privacy information.

Duration:00:51:20

Ask host to enable sharing for playback control

తల్లి పాల బ్యాంకు (Mothers milk bank)

8/31/2022
బిడ్డ ఆకలితో అల్లాడినా.. తల్లి మనసు అల్లాడిపోతుంది. అప్పుడే పుట్టిన పసికందులు తల్లిపాలు అందక ఆకలితో విలవిలలాడుతుంటే మాతృహృదయం.. కుల, మత, పేద, ధనిక తేడాలకు అతీతంగా స్పందిస్తుంది. నేటి సాంకేతికత తల్లుల పిల్లల కోసం సాయపడుతోంది. పాలు మిగిలిపోయే బాలింతలు, బిడ్డలు దూరమైన తల్లులు చనుబాలను దానం చేస్తున్నారు. తల్లి పాలు అందని పిల్లల కోసం వేరే మహిళ Breast milk feed cheyyatam మనకు తెలుసు . శతాబ్దాలుగా వాడుకలో ఉన్నదే . పుట్టగానే అనాథలుగా మారి సంరక్షణ కేంద్రంలో ఉన్న పసికందులు, వివిధ కారణాల వల్ల తల్లికి దూరంగా ఉంచే బిడ్డల ఆకలి తీర్చుతోంది ‘ధాత్రి’ మిల్క్ బ్యాంక్. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ 10 మంది వరకూ బాలింతలు చిన్నారుల ఆకలి తీర్చేందుకు ముందుకు వస్తున్నారు గతం లో వాడుకులో ఉన్నా కూడా తల్లి పాల దానం లేదా ఇతర పిల్లలకు అదనంగా ఉన్న పాలను ఇవ్వటం కాలక్రమేణా కనుమరుగు అవుతూ వచ్చింది . తల్లి పాలకు ఇతర వాణిజ్య మిల్క్ substitute కాదు . ఆరోగ్యపరంగా కూడా బెస్ట్ మదర్ మిల్క్ . ఎక్కువగా మిల్క్ వచ్చే తల్లులు తమ శిశువు తాగాక మిగిలింది ఏమిచెయ్యాలి ? ఏదైనా కారణంగా శిశువు ను కోల్పోయిన తల్లుల lactation pain ఎలా తీరుతుంది ? మిల్క్ డొనేషన్ ఎవరు ? ఎలా చెయ్యాలి ? ఎలా వాటిని స్టోర్ చేసి పంపాలి ? డోనర్ ఆరోగ్యానికి ఇబ్బందా ? రెసిపెంట్ అంటే ఆ పాలు తాగే బేబీ కి ఆరోగ్యం సరిగ్గా ఉంటుందా ? ఎవర్ని సలహా అడగాలి ? డబ్బా పాలు సరిపడవా ?తల్లి పాలే ఎందుకు ఇవ్వాలి ? అందుకు డబ్బు ఇవ్వాళా ? అనేక ప్రశ్నలు ,అనుమానాలుకు సమాధానం ఇస్తూ తల్లి పాల అవసరాన్ని , తల్లి పాల దానం గొప్పతనాన్ని చెబుతూ తెలుగు రాష్ట్రాలలో ఏర్పాటు చేసి పిల్లల ప్రాణాలు ఆరోగ్యం కాపాడుతున్న ధాత్రి mothers milk bank గురించిన వివరాలు ఇవ్వాల్టి సమాచారం సమీక్ష లో ధాత్రి founder director Dr . సంతోష్ కుమార్ క్రాలేటి గారి ఇంటర్వ్యూ లో తెలుసుకుందాము. See sunoindia.in/privacy-policy for privacy information.

Duration:01:01:20

Ask host to enable sharing for playback control

ఎలక్ట్రిసిటీ ఏమండ్మెంట్ బిల్ ఎందు కోసం? (Electricity ammendment bill)

8/19/2022
దేశం 75 yrs of independence ని వేడుకగా జరుపుకుంది . ఇప్పటికి దేశం లో అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయి లో మౌలిక వసతులు అందుబాటులోకి రాలేదు . వాటిలో విద్యుత్ సరఫరా ఒకటి . విద్యుత్ కనెక్షన్ లేని గ్రామాలు లేవనే వాదనలో ఎంత నిజం ఉందొ ఫ్యూ వీక్స్ బ్యాక్ రాష్ట్రపతి గౌరవనీయులు ముర్ము గారి స్వగ్రామానికి కల్పించిన కనక్షన్ ఉదాహరణ . విద్యుత్ వాడకం లేని జీవితాన్ని ,రంగాలను ఊహించటం కష్టమే . పవర్ కట్స్ మూలంగా అనుభవమే అయినా ఎలక్ట్రిసిటీ దేశ ఆర్ధిక ప్రగతికి , ప్రజల నిత్యా అవసరాలకు అవసరం . పవర్ కట్స్ ,పవర్ హాలిడేస్ ఆర్ధిక రంగం పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసు . అలంటి ఎలక్ట్రిసిటీ కి సంబంధించి ఉత్పత్తి ,పంపిణి , వినియోగం పై తీసుకు వస్తున్న విద్యుత్ సవరణ బిల్లు పై దేశ వ్యాప్తంగా చర్చలు ,వ్యతిరేకత ఎదుర్కొంటున్నది. ఈ చట్ట సవరణ ఎందుకు ? ఎవరి కోసం ? ఎవరికీ లాభం ? నష్టం ? అనే దానిపై ప్రజల్లో ఉన్న అనేక అనుమానాలు ,అయోమయం కు సమాధానం తెలుసుకునే ప్రయత్నం ఇవాళ్టి సమాచారం సమీక్ష ఎపిసోడ్ లో హోస్ట్ D . చాముండేశ్వరి తో విద్యుత్ రంగ నిపుణులు P. రత్నాకర్ రావు గారి ఇంటర్వ్యూ See sunoindia.in/privacy-policy for privacy information.

Duration:01:07:40

Ask host to enable sharing for playback control

Save Chevella Banyan trees

7/30/2022
మర్రి ( ఫికస్ బెంఘాలెన్సిస్ ) 750 కంటే ఎక్కువ రకాల అత్తి చెట్లలో ఒకటి,బన్యాన్స్ పర్యావరణ లించ్‌పిన్‌లు. అవి అనేక రకాల పక్షులు, గబ్బిలాలు, మరియు ఇతర జీవుల కు ఆహారం అందిస్తాయి మన జాతీయ వృక్షం.శతాబ్దాలుగా మనకు మేలు చేస్తున్న ట్రీ. దేశ సంస్కృతి లో భాగం. అలాంటి జాతీయ వృక్షం కి ప్రమాదం వచ్చింది. అదీ ఎక్కడంటే హరిత హారం కి పెట్టింది పేరుగా గర్వించే తెలంగాణలో. హైదరాబాద్ కి 45km దూరం లో చేవెళ్ల మన్నేగుడ మార్గం లో. 125 ఏళ్ల నుండి వందల సంఖ్యలో ప్రకృతి గొడుగు పట్టినట్లున్న చేవెళ్ల మర్రి చెట్ల నీడ అభివృద్ధి పేరుతో ప్రతిపాదించిన రోడ్డు విస్తరణ లో నశించే ప్రమాదం అంచున ఉన్నాయి. రహదారికి ఇరువైపులా మరో 9000 చెట్లు కూడా ఉన్నాయి. ఈ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) నిధులు మంజూరు చేయడంతో ఈ చెట్లపై గొడ్డలి వేటు పడే ప్రమాదం ఉంది. 1100 మర్రి చెట్లను నరికేయడాన్ని నిరసిస్తూ 200 మంది పర్యావరణ యోధుల బృందం తాజాగా సమావేశమైంది. ఈ చెట్లను కాపాడాలంటూ పర్యావరణ పరిరక్షకుల బృందం ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వాటి వద్ద దీపాలు వెలిగించి ఈ పురాతన చెట్లను పరిరక్షిస్తామని ప్రతిజ్ఙ చేశారు. మర్రి చెట్లను రక్షించుకునేందుకు చిన్నారులు, పెద్దలు కలిసి పెయింటింగ్స్ (Painting), పోస్టర్ల (Poster)ను ప్రదర్శించారు. చెట్లకు ప్రేమతో దారాలు కట్టారు. మర్రి చెట్లను రక్షించుకునేందుకు సంస్థ సభ్యులు ఆన్‌లైన్ (Online) ద్వారా ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. ఒక వేళ చెట్లను నరికి మరోచోట నాటినా అవి ఒకేలా ఉండవు, వాటి కొమ్మలు కత్తిరించి వేస్తారు. అందుకే రహదారి విస్తరణ ప్రాజెక్టును ఆపాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (Highways Authority of India)కు విజ్ఙప్తి చేశారు. NGT లో case file చేశారు.పోరాటం చేస్తున్నారు. అభివృద్ధి అంటే పర్యావరణం ని spoil చెయ్యటమా? చెట్లు కొండలు నదులు అడవులు నేలను రూపుమాపే చర్యా? ఎవరి స్వార్థం కోసం? పౌరులుగా,ప్రకృతి లో భాగ స్వాములుగా పర్యావరణ పరిరక్షణ కోసం జరుగుతున్న ప్రయత్నం లో అందరం కలసి రావాల్సిన అవసరం లేదా? ఇవాళ్టి సమాచారం సమీక్ష Interview లో హోస్ట్ చాముండేశ్వరి తో బాలాంత్రపు తేజ గారు చేవెళ్ల మర్రి చెట్ల ను కాపాడే ఉద్యమం గురించిన అనేక విషయాలను చెప్పారు. See sunoindia.in/privacy-policy for privacy information.

Duration:00:51:30

Ask host to enable sharing for playback control

చేనేత రంగానికి GST పెద్ద దెబ్బ

7/18/2022
కోటి మందికి పైగా జీవనోపాధి కలిగిస్తున్న చేనేత రంగానికి గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు ఏనాడు కూడా చేనేత రంగానికి 800 కోట్లకు మించి బడ్జెట్ కేటాయింపులు చేయలేదు. 2011లో చేనేత కళాకారుల రుణమాఫీకి మరియు సహాకార సంఘాల పటిష్టత కోసం 6 వేల కోట్ల ప్రత్యేక త్రిబుల్ ఆర్ (REVIVAL, REFORM AND RESTRUCTURING PACKAGE FOR HANDLOOM SECTOR) ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి 2825 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి 760 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మూడు ఆర్థిక సంవత్సరాల (2011-2014) కాలపరిమితిలో ఈ పథకం కింద కేవలం 760 కోట్లు ఖర్చు చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చేనేత రంగ కేటాయింపులను మరింతగా తగ్గించింది. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరానికి 410 కోట్లు కేటాయించి ఇప్పటివరకు కేవలం 20 కోట్ల ఏడు లక్షలు మాత్రమే ఖర్చు చేసింది మహాత్మాగాంధీ బునకర్ బీమా యోజన, ఐ.సి.ఐ.సి.ఐ లంబార్డ్ హెల్త్ స్కీమ్, హౌస్ కమ్ వర్క్ షెడ్ మరియు త్రిఫ్ట్ ఫండ్ పథకాలు రద్దయ్యాయి. చేనేత రంగానికి 410 కోట్లు కేటాయించి వేల కోట్లలో చేనేత రంగం నుండి జీఎస్టీ రూపంలో ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి.Over 15 lakh jobs in main and ancillary units లో కోల్పోతున్నాయి result of GST increase. unorganized sector accounts for over 80% of fabric production in the country, raising the GST on fabrics to 12% will hurt power loom and handloom weavers. బట్టల ధరలలో 15-20% పెరుగుదలకు అవకాశం ఉంది. రూ.పేద మధ్య తరగతి కొనుగోలు దారులే ఎక్కువగా నష్టపోతారని వ్యాపారుల వాదన.నిజం కూడా. కొనుగోలుదారులపై 5% జీఎస్టీ విధిస్తే రూ.1,500 కోట్లు, 5% జీఎస్టీని 12%కి పెంచితే రూ.3,600 కోట్లకు పెరుగుతుందనీ ప్రజలపై దాదాపు రూ.2,100 కోట్ల అదనపు భారం పడుతుందని వాదన.అంతిమంగా ప్రతి టాక్స్ పెరుగుదల ను భరించేది కస్టమర్. అటు చేనేత రంగానికి ,ఇటు వినియోగదారులకు ఎవ్వరికీ బెనిఫిట్ లేని పన్నుల పెంపు ఎంతవరకు సమంజసం? ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేనేత ఎగుమతుల విషయంలో గత ప్రభుత్వం యొక్క బెంచ్ మార్కును దాటలేకపోయింది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో 2812 కోట్ల రూపాయల చేనేత ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. చేనేత రంగ అభివృద్ధి మరియు చేనేత కళాకారుల సంక్షేమం కోసం తాను పని చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం విశ్వాసాన్ని కల్పించారు. కానీ వాస్తవికతలో దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. రోటీ కపడా మకాన్ ప్రజల నిత్యావసరాలు. మరి చేనేత పై ఇంత వివక్ష ఎందుకు ? ఈ విషయం గురించి మరిన్ని విషయాలు Founder of National handloom day, President, Akhila Bharatha Padmashali Sangam handloom యార్రమాద వెంకన్న నేత గారి interview లో విందాము. See sunoindia.in/privacy-policy for privacy information.

Duration:00:55:00

Ask host to enable sharing for playback control

Menstrual Hygiene వాస్తవాలు

6/29/2022
భారతదేశంలో కేవలం 36 శాతం మంది మహిళలు మాత్రమే పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్‌లను ఉపయోగిస్తున్నారు. బహిష్టు సాధారణమైనది మరియు జీవితంలో ఆరోగ్యకరమైన భాగం, అయినప్పటికీ భారతదేశంలోని బాలికలు మరియు మహిళలు ప్రతి నెలా periods time లో చాలా ఇబ్బందులు పడుతుంటారు. మన దేశంలో రుతుక్రమం ని ఎక్కువ మంది 'శాపం', 'అశుద్ధం' మరియు 'మురికి' అని నమ్ముతున్నారు. సెన్సస్ 2011 జనాభా డేటా ప్రకారం, భారతదేశంలో దాదాపు 336 మిలియన్ల మంది బాలికలు మరియు మహిళలు ప్రతి నెలా 2-7 రోజుల పాటు పునరుత్పత్తి వయస్సు మరియు ఋతుస్రావం కలిగి ఉన్నారు, Menstrual hygiene సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు, అది ఆమె శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అనేక సమస్యలను కలిగిస్తుంది. విద్య, ఆత్మగౌరవం మరియు విశ్వాసం కూడా దెబ్బతింటుంది. భారతదేశంలో ఋతు పరిశుభ్రత పద్ధతులకు స్థిరమైన ప్రత్యామ్నాయాలను కనుగొనవలసిన అవసరము ఉందని అనేక reports చెబుతున్నాయి. ఎందుకంటే ఇందులో 121 మిలియన్ల మంది బాలికలు మరియు మహిళలు సంవత్సరానికి 21,780 మిలియన్ ప్యాడ్‌లను పారవేస్తారని అంచనా .అది పర్యావరణం కి సమస్యగా మారుతోంది. ఈ సమస్య మహిళకు గర్భాశయ క్యాన్సర్, సెర్విక్స్ ఇన్ఫెక్షన్లు, హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్, వివిధ రకాల ఈస్ట్ ఇన్ఫెక్షన్లు మరియు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వంటి కొన్ని వచ్చే అవకాశాలను పెంచుతుంది మొదటిసారిగా రుతుక్రమం వచ్చే వరకు రుతుక్రమం గురించి తెలియదు. శానిటరీ నాప్‌కిన్‌ల లభ్యత మరియు రుతుక్రమం గురించి అవగాహనతో సహా రుతు సంబంధ పరిశుభ్రత నిర్వహణ సౌకర్యాలు లేకపోవడం వల్ల భారతదేశంలో దాదాపు 23 మిలియన్ల మంది బాలికలు ఏటా పాఠశాల నుండి తప్పుకుంటున్నారని సమాచారం. ఈ సమస్య కేవలం ఫెమల్స్ దే కాదు. దాపరికం అవసరం లేదు.ఇంట్లోని మగవారికి కూడా అవగాహన అవసరం. ఫ్యామిలీ, society, government అందరి కి సరైన awareness ఉండి తగిన చర్యలు తీసుకోవాలి.తగిన వసతులు,సపోర్ట్ ఇవ్వాలి. హెల్తీ ఫ్యామిలీ , society కి హెల్తీ ఉమెన్ అవసం . ఇవాల్టి సమాచారం సమీక్ష లో హోస్ట్ చాముండేశ్వరి తో youngistan ఫౌండర్ అరుణ్ డానియల్ యల్లమంటి గారి interview. See sunoindia.in/privacy-policy for privacy information.

Duration:00:41:25

Ask host to enable sharing for playback control

Pride month special

6/15/2022
1969 మాన్‌హట్టన్‌లోని స్టోన్‌వాల్ తిరుగుబాటును పురస్కరించుకుని లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ మరియు క్వీర్ (LGBTQ+) ప్రైడ్ నెలను ప్రస్తుతం ప్రతి సంవత్సరం జూన్ నెలలో జరుపుకుంటారు. వేడుకల్లో ప్రైడ్ పరేడ్‌లు, పిక్నిక్‌లు, పార్టీలు, వర్క్‌షాప్‌లు, సింపోసియా మరియు కచేరీలు ఉన్నాయి మరియు LGBTQ ప్రైడ్ మంత్ ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది పాల్గొనేవారిని ఆకర్షిస్తాయి అన్ని అంచనాల ప్రకారం, న్యూయార్క్ నగరంలో ప్రారంభమైన ప్రైడ్‌లో మూడు నుండి ఐదు వేల మంది ఉన్నారు మరియు నేడు న్యూయార్క్ నగరంలో మిలియన్ల సంఖ్యలో ఉన్నారు. 1970 నుండి, LGBTQ+ వ్యక్తులు ప్రైడ్‌తో కవాతు చేయడానికి మరియు సమాన హక్కుల కోసం ప్రదర్శన చేయడానికి జూన్‌లో ఒకచోట చేరడం కొనసాగించారు. సోషల్ మీడియా క్వీర్ విజిబిలిటీకి వేదికగా మారకముందే, ఇంటర్నెట్ LGBTQ+ కమ్యూనిటీలో కమ్యూనికేషన్ మరియు కమ్యూనిటీ బిల్డింగ్ కోసం అవకాశాలను సృష్టించింది ఆన్‌లైన్ కమ్యూనిటీలు భారతదేశంలో స్వలింగ సంపర్కులను కలవడానికి సురక్షితమైన మరియు అనుకూలమైన వాతావరణాన్ని కూడా అందిస్తాయి. బాలీవుడ్‌లో స్వలింగ సంపర్కులు మరియు లింగమార్పిడి పాత్రలు ఉన్నప్పటికీ, వారు ప్రధానంగా అపహాస్యం లేదా దుర్వినియోగానికి గురయ్యారు ప్రధానంగా భారతీయ సంప్రదాయవాద కుటుంబానికి రావడంపై దృష్టి సారిస్తుంది మరియు యువ గే యువకుడి పోరాటాలు మరియు వారు యుక్తవయస్సులో ఉన్న అభద్రతాభావాలపై వెలుగునిస్తుంది. ఇవాళ్టి సమాచారం సమీక్ష లో ప్రైడ్ మంత్ గురించి హోస్ట్ చాముండేశ్వరి తో చిదానంద శాస్త్రి గారి interview. See sunoindia.in/privacy-policy for privacy information.

Duration:00:46:35

Ask host to enable sharing for playback control

Hyderabad కి జంట జలాశయాలు అవసరం లేదా? (Doesn’t Hyderabad need reservoirs?)

3/30/2022
హైదరాబాద్ నగర శివారులోని గండిపేట, హిమాయ తసాగర్ జలాశయాలున్నాయి. హైదరాబాద్ మహా నగరానికి ఎన్నో ఏళ్లుగా తాగునీటి అవసరాలను తీర్చుతున్నాయి. ఈ రిజర్వాయర్‌ల పరిరక్షణకు జీవో 111 అమల్లో ఉంది. వీటి చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ.. 1994లో తొలుత జీవో నం. 192ను తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111ను తెచ్చింది. ఈ రెండు జలాశయాల పరిరక్షణ కోసం పలు వాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నారు. మొత్తం 84 గ్రామాలు దీని పరిధిలో ఉన్నాయి. జీవో 111 (GO 111) ని ఎత్తివేస్తామన సీఎం కేసీఆర్ (cm kcr) అసెంబ్లీ వేదికగా ప్రకటించడంపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది.మిషన్ కాకతీయతతో గ్రామాల్లో చెరువుల సంరక్షణకు కంకణం కట్టుకున్న సర్కార్.. హైదరాబాద్ జలాశయాల విషయంలో మాత్రం ఇలాంటి నిర్ణయం ఎందుకు ? జీవో ఎత్తివేతకు వ్యతిరేకంగా పలువురు పర్యావరణవేత్తలు కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జీవోపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది జీవో 111పై ప్రత్యేకంగా సమీక్షించారు. జలాశయాలను పరిరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించింది govt. కోర్టు అడిగిన నివేదిక కు మరింత టైం అడిగిన govt.భవిష్యత్తుల్లో వందేళ్ల వరకు కూడా హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య రాదని పేర్కొంటున్నారు. అభివృద్ధి పేరుతో water bodies conservation నీ ఎలా అశ్రద్ధ చేస్తారు? వాటిని కూడా tank band లా మురికికూపం చేస్తారా? Lakes encroachment మూలంగా జరిగే అనర్ధాలు చూస్తూ కూడా జంట Lakes అవసరం లేదని ఎలా అంటారు అందువల్ల వచ్చే పర్యావరణ సమస్యలు ఎంటి? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు. సమాచారం సమీక్షలో హోస్ట్ D.Chamundeswari తో Consultant Water resources and climate change, B V Subba Rao గారి interview లో వినండి. See sunoindia.in/privacy-policy for privacy information.

Duration:00:37:25

Ask host to enable sharing for playback control

COVID times learning loss

2/24/2022
2020 ప్రారంభం లో ఎవ్వరూ ఊహించని విపత్తు covid pandamic రూపంలో విరుచుకుపడింది. లైఫ్ మారిపోయింది. Schools ఆఫీసులు అన్నీ క్లోజ్. అనారోగ్యం భయం uncertenity. Covid pandamic విద్య వైద్యం ప్రజారోగ్యం వసతులు ఎంతటి తక్కువ స్థాయిలో ఉన్నాయి ప్రజలు ప్రభుత్వాలకు తెలిసేలా చేసింది. ఈ pandamic లో అన్నీ విధాల నష్టపోయింది స్టూడెంట్స్.కేజీ to PG మూతపడిన education institutes తో చదువు మూలపడింది. ఫిజికల్గా బోధన వీలవని స్థితి లో online Classes. దేశము లో ఎంతమందికి టీచింగ్ అందిందో ఖచ్చితం గా తెలీదు.టీవీ సెల్ , laptops ముందు కూర్చుని విన్నా class room teaching కి సరిపోదు. అసలే స్టూడెంట్ drop out rate ఎక్కువ.pandamic లో education, teaching, learning లో sudden గా వచ్చిన మార్పులు తీవ్రమైన లెర్నింగ్ Loss కి దారితీశాయి.స్టూడెంట్స్ మానసిక శారీరిక పెరుగుదల ఎఫెక్ట్ అయింది. స్టూడెంట్స్ టీచర్స్ పేరెంట్స్ అందరూ ఒత్తిడికి లోనయ్యారు.schools etc reopen అయ్యాయి.కానీ అనేక సమస్యలు. Loss అయిన time , learning gap ని ఎలా fill చెయ్యాలి.? స్టూడెంట్స్ ఎలా ప్రోత్సహించాలి? సిలబస్ వెనక పరుగు అవసరమా? విద్యా సంస్థలు,పేరెంట్స్ , టీచర్స్,govt ఈ ఇష్యూ నీ solve చెయ్యటానికి prepared గా ఉన్నారా?మనకి కావాల్సింది ఒత్తిడితో ఉన్న బోధనా? లేక స్టూడెంట్స్ all round development? Learning loss తగ్గించటం లో స్టూడెంట్స్ మానసిక స్థితి అర్థం చేసుకుని,help చెయ్యాలి. ఈ complex issues ని solve చెయ్యటానికి ఉన్న అవకాశాల గురించి ఈ interview లో తరుణ్ చెరుకూరి గారి అభిప్రాయాలు తెలుసుకుందాము. See sunoindia.in/privacy-policy for privacy information.

Duration:00:49:10

Ask host to enable sharing for playback control

జన్యుమార్పిడి పంటలు, ఆహారం (Genetically modified crops and foods)

1/13/2022
ప్రపంచం లో ఫస్ట్ GM crop పొగాకు 1982 లో. మనుషులు తినే పంటలో 1994 అమెరికాలో టొమాటో మొదటిది తరువాత సోయాబీన్ కార్న్ brinjal బొప్పాయి ఆలు చెరకు వరి పత్తి లాంటివి లిస్ట్ లో చేరాయి. GM పంటలో తెగుళ్లు తక్కువ. దిగుబడి పోషకాలు ఎక్కువ అనే ప్రచారం ఉంది. నిజమెంతో ఆయా దేశాల్లోని వ్యవసాయ నిపుణులు చెప్పాలి. GM పంటల సాగు, consumptionలో సమస్యలు ఉన్నాయనే అభిప్రాయం ఉంది.సాధారణం గా రైతు పండే పంట లోంచే విత్తనాలు తయారుచేసుకుని మళ్ళీ వాడుకుంటాడు.GM crops లో అది వీలుకాదు. రైతు కి ఆర్థికభారం విత్తన కంపెనీలపై dependency పెరిగే అవకాశం ఎక్కువ. FSSAI తీసుకువస్తున్న Food Safety And Standards (GM foods) regulations 2021 draft bill లో ఉన్న లోపాలు ఏంటి? GM crops Foods విషయం లో ప్రజలు ,రాష్ట్రాల Public opinion ఎలా ఉంది అనే అనేక విషయాల గురించి సమాచారం సమీక్ష లో Kavitha Kuruganti interview లో వినండి. See sunoindia.in/privacy-policy for privacy information.

Duration:00:45:00

Ask host to enable sharing for playback control

భవితకు భరోసా Rain water harvesting ( Future is assured with rainwater harvesting)

11/18/2021
దేశం లో అనేక ప్రాంతాల్లో మనకు కనిపించే మెట్ల బావులు మోట బావులు చెరువులు కుంటలు నేడు పాడుబడిన అవి కొద్ది దశాబ్దాల కిందట వరకు ప్రజల సాగు నీటి తాగు నీటి అవసరాల కోసం ఎంతో ఉపయోగపడ్డాయి.ఇప్పుడు బావులు వాడకం తగ్గిపోయింది.దాదాపుగా కనిపించకుండా పోతున్నాయి. కారణాలు అనేకం. యునెస్కో అంచనా ప్రకారం ప్రపంచం లోనే అత్యధికంగా గ్రౌండ్ వాటర్ ను వాడే దేశం ఇండియా. 2007-2017 మధ్య కాలంలో దేశం లో భూగర్భ జలాలు 61% తగ్గాయని అంచనా.అందువల్ల మంచి నీటికే కాదు ఆహార భద్రత కు పెద్ద ప్రమాదం.వర్షపాతం లో 70% వరకు అనేక కారణాల వల్ల కలుషితం అయి వాడకానికి పనికిరాదు.వాటర్ క్వాలిటీ ఇండెక్స్ లో ఇండియా కి 120ప్లేస్. అందుబాటులో ఉన్న నీరు త్రాగటానికి పనికిరాక ప్రజలు దూరప్రాంతాల నుండి నీటిని తీసుకునే పరిస్థితి. మెట్రో సిటీస్. సిటీస్ ,టౌన్స్ కు ఇదే పరిస్థితి.వందల మైళ్ళ దూరం నుండి నీటిని తెచ్చి ప్రజలకు అందిస్తున్నారు. వానలు వస్తే పరిస్థితి తెలిసిందే .వరద ముంపు .వానలు ఆగిన తరువాత యధాస్థితికి వస్తుంది.నీటి ఎద్దడి.నీటి కష్టాలు.దేశంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది.అందరికీ మంచినీరు దొరకని పరిస్థితి.రాష్ట్రాల మధ్య నీటి తగవులు.disputes.పరిస్థితి మరింత దిగజారే ముందే ప్రజలు ప్రభుత్వాలు మేల్కొని వాన నీటిని ఈవిధంగా గా ఒడిసిపట్టి వాడుకోవాలి అని తెలుసుకోవాలి. నీటి వనరులు అన్నింటినీ క్లీన్ చేసి Rain water ni వాటిలో చేరేలా చూడాలి.ఇందులో ప్రజల భాగస్వామ్యం అవసరం. మంచి నీటి నీ భవి తరాలకు అందించటానికి మనకు అందుబాటులో ఉన్న వనరులు మెట్ల బావులు బావులు చెరువులు కుంటల ను ఎలా పునరుద్ధరించాలని ,rain water harvesting ను ఎలా చెయ్యాలో water warrior గా పిలవబడే Kalpana Ramesh గారి ఇంటర్వ్యూ లో వినండి See sunoindia.in/privacy-policy for privacy information.

Duration:00:46:40

Ask host to enable sharing for playback control

సమాచార హక్కు చట్టం బలహీన పడుతోందా? (Is RTI being diluted?)

10/30/2021
Right to information act సులువుగా చెప్పాలంటే RTI గా పిలవబడే సమాచార హక్కు చట్టం ప్రజలకు పార్లమెంట్ సాక్షి గా సిద్ధించిన గొప్ప చట్టం.ముఖ్య ఉద్దేశ్యం దేశం లోని అన్ని ప్రభుత్వ సంస్థలు ,ప్రభుత్వ పాలనలో పారదర్శకత ను పెంచటం. చట్టాల అమలులో పారదర్శకత accountability అవినీతిని అరికట్టడం ప్రజాస్వామ్యం ప్రజల కోసమే పనిచేసేలా చూడటానికి తగిన విధంగా ప్రజలను అప్రమత్తం గా ఉండేలా చెయ్యటమే చట్టం ఉద్దేశ్యం. 2005 లో పార్లమెంట్ లో ఆమోదం పొంది రాజ్యాంగం లోని ఆర్టికల్ 19 (1)(a) ప్రకారం RTI చట్టం ప్రాథమిక హక్కు దేశ ప్రజలు ఎప్పుడైనా ఎక్కడైనా తనకు కావలసిన సమాచారాన్ని అడిగి పొందే అవకాశం హక్కుని కలిగించింది ఈ చట్టం. గత 16 సంవత్సరాలుగా ఉనికిని చాటుతూ ప్రజలకు వజ్రాయుధం గా ఉన్న RTI చట్టం కాలక్రమేణా బలహీనం పడుతున్నది అనే ఆందోళన ఉన్నది ప్రజల్లో. ప్రభుత్వాలు పాలకులు ఎవరైనా తమని ప్రశ్నించటం వారికి నచ్చదు.సమాచారం కోసం వచ్చిన దరఖస్తుదారులకు సమాధానం సకాలంలో దొరక్కపోవచ్చు. ఇలాంటి నేపథ్యం లో తెలంగాణలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం ఉన్నత అధికారుల అనుమతి తో RTI applications కి Reply ఇవ్వాలనే నిబంధన RTI అమలు లో ఆందోళన కలిగిస్తోంది అని న్యాయ నిపుణుల అభిప్రాయం రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కు RTI చట్టం కి ఆటంకం అనొచ్చా? చట్టం లో అలాంటి ప్రస్తావన ఉందా?సర్క్యులర్ న్యాయపరంగా ఉందా? ఇలాంటి అనేక సందేహాలకు సమాధానం సమాచారం సమీక్ష లో Factly founder. RTI activist Rakesh Dubbudu గారి interview లో తెలుసుకుందాము. See sunoindia.in/privacy-policy for privacy information.

Duration:00:39:00

Ask host to enable sharing for playback control

Palliative కేర్ ఎందుకు ?ఎవరికి అవసరం?

10/19/2021
ఆరోగ్యమే మహభాగ్యము అనే నానుడి సామెత అందరికీ తెలిసిందే.అది అక్షరసత్యం నిజం అని కోవిడ్ pandemic రుజువు చేసింది. వ్యక్తుల ఆరోగ్యం కుటుంబానికే కాదు దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు అవసరం. విద్య వైద్య ప్రజారోగ్య వసతులపై ప్రజలు ప్రభుత్వాలు చేసే ఖర్చు నీ మానవవనరుల అభివృద్ధి కి పెట్టుబడిగా చెప్పవచ్చు. అనారోగ్యానికి అనేక కారణాలు ఉండొచ్చు. పౌష్ఠికాహార లోపం పెరుగుతున్న కాలుష్యం అల్పాదాయ ప్రజారోగ్యం పట్ల అశ్రద్ధ వనరుల లేమీ జనాభాకు తగినంతగా లేని వసతులు. తదితర వివిధ ప్రాణాంతక వ్యాధుల కారణంగా తీవ్ర అనారోగ్యం తో బాధ పడుతూ చికిత్స దొరికిన శరీరం సహకరించని స్థితి లో భరించలేని నొప్పి బాధ రోగి ,పక్కనే ఉన్నా ఉపశమనం కలిగించే లేని పరిస్థతుల్లో కుటుంబ సభ్యులు మానసిక ఆర్థిక ఒత్తిడి కుంగుబాటు గురి అవుతుంటారు అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న రోగులు వారి కుటుంబ సభ్యులకు స్వాంతన కలిగిస్తూ రోగికి అవసరమైన తగిన పూర్తి స్థాయి చికిత్స ఊరట అవగాహన చివరి మజిలీ ప్రశాంతం గా చేరటానికి తగిన మానసిక కౌన్సిలింగ్ వివిధ దశల్లో అంద చేస్తూ ,బాసటగా నిలుస్తూ సేవ చేస్తున్న pain relief and Palliative care society of Hyderabad లాంటి NGO, telangana లో ప్రభుత్వం తో కలిసి పనిచేస్తున్న సందర్భాలున్నాయి. Palliative care గురించిన అవగాహన అవశ్యకత గురించి రోగుల కే కాదు సామాన్య ప్రజలకు ఆరోగ్య సిబ్బంది కి తక్కువే.గత కొద్ది సంవత్సరాలుగా రాష్ట్రం లో ఈ దిశగా తగిన పురోగతి వస్తున్నది.ఒక అంచనా ప్రకారం దేశం లో Palliative care అవసరం అయిన రోగుల్లో 4% కన్నా తక్కువ మందికే చికిత్స సేవలు దొరుకుతున్నాయి. 2019 world health day సందర్భంగా WHO తన statement లో యూనివర్సల్ హెల్త్ కేర్ అందరికీ అందాలంటే ఆ దిశలో తొలి అడుగు ప్రాథమిక ఆరోగ్యం మరియు palliative care ki తగిన వసతుల సేవల కల్పన. 2012 లో indian National program for palliative care NPPC ని ప్రారంభించారు.2017 నుండి NPPC సహకారం చేవెళ్ల ఏరియా హాస్పిటల్ లో తరువాత ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో palliative care units స్టార్ట్ చేస్తున్నారు. అంతే కాకుండా pain relief and palliative care society ఆధ్వర్యం లో నడుస్తున్న సెంటర్స్ సేవలు Hyderabad లో అందుబాటు లో ఉన్నాయి. Palliative care అంటే ఏమిటి ఎవరికి ఏ దశలో అవసరం ఎవరిని అడగాలి ఖర్చు తో కూడిన వ్యవహార మా ఎంత కాలం ఎలా అనే ప్రశ్నలకు సమాధానం dr priya chandran garu సమాచారం సమీక్ష హోస్ట్ D చాముండేశ్వరి తో ఈ interview లో వివరించారు. సహాయం కావలిసిన వారు, సహాయం చేయాలనుకునే వారు ఈ క్రింది ఫోన్ నంబర్ లో కాంటాక్ట్ అవొచ్చు. +91 98669 16065 See sunoindia.in/privacy-policy for privacy information.

Duration:00:35:30

Ask host to enable sharing for playback control

సత్వర న్యాయం. సమంజసమా? (Does speedy justice make sense?)

9/30/2021
గత కొద్ది సంవత్సరాలుగా మహిళలు బాలికల మీద జరుగుతున్న పెరుగుతున్న లైంగిక నేరాలు వేధింపులు హత్యలు అత్యాచారాలు. వీటిని అరికట్టే చట్టాలు ఉన్నా ,తరచుగా చూస్తున్న వింటున్న అనాగరిక డిమాండ్ సత్వర న్యాయం పేరుతో నేరస్థుడు అని అనుకున్న వారిని Encounter చేసి అయినా చంపాలి అని. న్యాయ విచారణ పద్ధతులను కాదని ఆటవిక న్యాయం కోరటం ఎంతవరకు సమంజసం? ఇలాంటి సంఘటనలు ఢిల్లీ నుండి గల్లీ దాకా అప్పుడప్పుడు చూస్తుంటాము. కొద్దిమంది ప్రజలు నాయకులనే వారు న్యాయం గురించిన అవగాహన లోపం లేదా vote bank politics కోసమో చేసే ఇలాంటి demands కి చట్టబద్ధత ఉండదు కదా? నిర్భయ లాంటి అనేక కొత్త పాత న్యాయ చట్టాలు తెచ్చినా మరణ దండన విధించిన నేరాలు తగ్గకపోవడం ఎందువల్ల? క్రైమ్ against women NCRB 2019 report ప్రకారం ,రిపోర్ట్ అయిన కేసు లు 4లక్షల కు పైన ఉన్నాయి. రిపోర్ట్ కానివి లెక్క తెలీదు.కారణాలు అనేకం. సగటున రోజుకు 88 రేప్ కేసు లు . రిపోర్ట్ అయిన రేప్ కేసుల్లో శిక్షలు పడినవి తక్కువే. దేశం లో 12yrs లోపు బాలికలపై జరిగే లైంగికదాడులు పెరిగాయి. న్యాయం దొరకటం లో సమయం పడుతుందని వంకతో అనుమానితులను న్యాయ రాజ్యాంగ మానవ హక్కుల పరిధి దాటి వెంటనే శిక్షించాలని అనుకోవటం ఎంత న్యాయం? ఆటవిక న్యాయం కోరటం కంటే ప్రభుత్వాలు పార్టీలు ప్రజలు మార్పు దిశగా చేపట్టాల్సిన పనులెంటి ? అనే అంశం పై సమాచారం సమీక్ష హోస్ట్ D చాముండేశ్వరి తో మాడభూషి శ్రీధర్ ఆచార్యుల గారి interview డీన్ స్కూల్ ఆఫ్ లా Mahendra University See sunoindia.in/privacy-policy for privacy information.

Duration:00:34:40

Ask host to enable sharing for playback control

చేనేత కు కావాలి చేయూత (Handlooms need help)

8/24/2021
కేవలం చేనేత వారోత్సవాలు మాత్రమే కాదు నిరంతరం ప్రజలు వినియోగదారులు, సంస్థలు ప్రభుత్వాల నుండి కావాలి ఒక భరోసా. ఉత్పత్తులకు కావాలి సరైన ఆదరణ మార్కెటింగ్.ప్రతి ఊరు పట్టణం లో ఉండాలి చేనేత అమ్మకాలు. తెలంగాణ రాష్ట్ర చేనేత ఉత్పత్తులుకు దేశవిదేశాల్లో పేరున్నది. పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట, గొల్లభామ పట్టు నూలు చీరలు , వరంగల్ దర్రీలు , తువ్వాళ్ళు దుప్పట్ట్లు డ్రెస్సస్ ఒకటేంటి లిస్ట్ పెద్దది. చేనేత రంగం లో నేత కార్మికులు ఇతర అనుబంధ కార్మికులు 40533 కంటే ఎక్కువగా ఉన్నారు.పవర్ లూమ్స్ లో 36000 కార్మికులు ఉన్నారని ఒక అంచనా.615 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. నేత కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ ప్రోత్సాహక పథకాలు అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ చేనేత రంగం లో తయారీదారులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు , వారి సూచనలు ,వారు ప్రభుత్వం ,వినియోగదారుల నుండి ఆశిస్తున్న చేయూత ఏమిటి? ఇతర సాధకబాధకాలు ముఖ్యం గా వరల్డ్ ఫేమస్ వరంగల్ దర్రీ ల తయారీదారులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు వరంగల్ చేనేత కార్మికుల గౌరవాధ్యక్షులు చిప్ప వెంకటేశ్వర్లు గారి ఇంటర్వ్యూ లో విందాము. (Handlooms need our support not just during handloom festivals but on a regular basis. They need proper rate and market. Every village and town should have markets to sell handloom. Telangana handlooms are well known in India and abroad. Pochampalli, Gadwal, Narayanapet, Golabama silk sarees, Warangal rugs, carpets, towels, bedsheets, dresses etc are well known. There are more than 40533 workers working in handlooms in telangana and around 36000 in power looms. And there are around 615 cooperatives. There are many schemes by state and central governments for handloom workers even then the handloom workers are facing many problems. In this episode, we listen to what they expect from the government? what do they expect from consumers? And other issues mainly by manufacturers of world-famous Warangal rugs. Host, D Chamundeswari talks about this and more with Warangal Handloom workers association president Mr. Chippa Venkateswarulu.) You can contact them on +91-9908244777/ 9849221300 See sunoindia.in/privacy-policy for privacy information.

Duration:00:29:30